Asia Cup 2022: ఆసియాకప్‌ను కైవసం చేసుకున్న శ్రీలంక

Sri Lanka Won the Asia Cup 2022
x

Asia Cup 2022: ఆసియాకప్‌ను కైవసం చేసుకున్న శ్రీలంక

Highlights

Asia Cup 2022: 6వ సారి ఆసియాకప్‌ను కైవసం చేసుకున్న శ్రీలంక

Asia Cup 2022: పాకిస్థాన్‌ను చిత్తు చేస్తూ ఆసియా కప్ టోర్నీలో శ్రీలంక జట్టు విజేతగా అవతవరించింది. 171 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పాకిస్థాన్‌ను 23 పరుగుల తేడాతో ఓడించింది. 171 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ సరిగ్గా 20 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. మదుషాన్ 4 వికెట్లతో చెలరేగితే.. హసరంగ ఒకే ఓవర్‌లో మూడు వికెట్లతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. రిజ్వాన్ 55 పరుగులతో ఒంటిరి పోరాటం చేశాడు. ఇఫ్తికర్ అహ్మద్ మినహా మిగిలిన ప్లేయర్స్ నుంచి రిజ్వాన్‌కు సహకారం లభించలేదు.

అంతకుముందు శ్రీలంక బ్యాటర్ భానుక రాజపక్స వీరోచిత పోరాటంతో జట్టుకు భారీ స్కోరును అందించాడు. కష్టసమయంలో క్రీజులోకి వచ్చిన రాజపక్స 45 బంతుల్లో 71 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 6 ఫోర్లు, 3 సిక్సర్లు ఉండటం విశేషం. ఫలితంగా శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 170 పరుగులు చేసింది. శ్రీలంక ఖాతాలో ఇది 6వ ఆసియా కప్ టైటిల్. శ్రీలంక జట్టు గతంలో 1986, 1997, 2004, 2008, 2104లోనూ టైటిల్ సాధించింది.


Show Full Article
Print Article
Next Story
More Stories