Sreesanth Returns: వికెట్‌ పడగొట్టి కన్నీరు పెట్టుకున్నశ్రీశాంత్.. వైరల్ వీడియో

టీమిండియా బౌలర్ కేరళ స్పీడస్టర్‌ శ్రీశాంత్‌ ఏడేళ్ల నిషేధం పూర్తి చేసుకొని ముస్తాక్‌ అలీ ట్రోపీతో రీఎంట్రీ ఇచ్చాడు.

Samba Siva Rao
Published on: 12 Jan 2021 10:13 PM IST
Sreesanth Returns: వికెట్‌ పడగొట్టి కన్నీరు పెట్టుకున్నశ్రీశాంత్.. వైరల్ వీడియో
X

టీమిండియా బౌలర్ కేరళ స్పీడస్టర్‌ శ్రీశాంత్‌ ఏడేళ్ల నిషేధం పూర్తి చేసుకొని ముస్తాక్‌ అలీ ట్రోపీతో రీఎంట్రీ ఇచ్చాడు. తొలి మ్యాచ్‌లోనే వికెట్‌ పడగొట్టిన శ్రీశాంత్‌.. తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేసి 29 పరుగులిచ్చి ఒక వికెట్‌ దక్కించుకున్నాడు. ఆ ఆనంద సమయంలో కన్నీరు పెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను శ్రీశాంత్‌ స్వయంగా ట్విటర్‌లో పంచుకున్నాడు.

ఈ సందర్భంగా శ్రీకాంత్ .. చీకటి రోజులు ముగిసిన తర్వాత ఆడుతున్నమొదటి మ్యాచ్ ఇన్నాళ్లు అభిమానులు నాపై చూపించిని ప్రేమ, అభిమానానికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని దేవుడిని కోరుకుంటున్నా అంటూ శ్రీశాంత్ ట్వీట్‌ చేశాడు.

2005లో భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీశాంత్‌ టీమిండియా తరపున 27 టెస్టులు, 57 వన్డేలు, 10 టీ20లు ఆడాడు. 2013 ఐపీఎల్‌ సీజన్‌ సందర్భంగా స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అప్పట్లో రాజస్తాన్‌ రాయల్స్‌కు ఆడుతున్న శ్రీశాంత్‌ తన సహచర క్రికెటర్లైన అంకిత్‌ చవాన్‌, అజిత్‌ చండీలాతో కలిసి బుకీలను కలిసినట్లు తేలడంతో బీసీసీఐ శ్రీశాంత్‌తో పాటు మిగతా ఇద్దరి ఆటగాళ్లపైన జీవితకాల నిషేదం విధించింది.

అయితే తాను నిర్దోషినంటూ శ్రీశాంత్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. దోషిగానే గుర్తించిన సుప్రీం.. జీవిత కాల శిక్షను మాత్రమే తగ్గించమంటూ బీసీసీఐకి సూచించింది. దాంతో అతని శిక్షను ఏడేళ్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. శ్రీశాంత్ పై విధించిన నిషేదం గత ఏడాది సెప్టెంబర్ లోనే ముగిసింది. శ్రీశాంత్ మళ్లి టీమిండియాలోకి వస్తాడని అతని అభిమానులు భావిస్తున్నారు



Samba Siva Rao

Samba Siva Rao

Next Story