T20 World Cup 2021: టీ20 వరల్డ్‌కప్‌లో దూసుకెళ్లిన సౌతాఫ్రికా

* శ్రీలంకపై 4 వికెట్ల తేడాతో విజయం

Shilpa
Published on: 31 Oct 2021 6:38 AM IST
South Africa Won the  Match Against Sri Lanka with 4 Wickets in T20 World Cup 2021
X

టీ20 వరల్డ్‌కప్‌లో దూసుకెళ్లిన సౌతాఫ్రికా(ఫైల్ ఫోటో)

T20 World Cup 2021: టీ20 ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా దూసుకువెళ్తోంది. షార్జా వేదికగా శ్రీలంక తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో నెగ్గింది. లంక 143 పరుగుల టార్గెట్‌ను సౌతాఫ్రికా మరో బాల్‌ మిగిలి ఉండగానే ఛేదించింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో కెప్టెన్‌ బావుమా రాణించగా మార్‌క్రమ్‌ ఫర్వాలేదనిపించాడు. చివర్లో విజయానికి కావాల్సిన పరుగులు ఎక్కువ ఉండడంతో కాస్త ఉత్కంఠ నెలకొంది. అయితే, డేవిడ్‌ మిల్లర్ వేగంగా ఆడి జట్టుకు విజయాన్ని అందించారు.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 142 పరుగులు చేసి ఆలౌటైంది. నార్జ్‌ వేసిన నాలుగో ఓవర్‌లో శ్రీలంక తొలి వికెట్‌ని కోల్పోయింది. అన్రిచ్‌ నోర్జే బౌలింగ్‌లో ఓపెనర్‌ కుశాల్‌ పెరీరా 7 రన్స్ చేసి, ఔటయ్యాడు. దీంతో పవర్‌ ప్లే పూర్తయ్యే సరికి 39 పరుగుల వద్దే స్కోరుబోర్డు ఆగిపోయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌ వచ్చిన చరిత్‌ అసలంక, మరో ఓపెనర్‌ పీతమ్‌ నిశాంకతో కలిసి ధాటిగా ఆడాడు.

Shilpa

Shilpa

Next Story