Tit for tat: కోహ్లీ, గంగూలీ మధ్య సోషల్ వార్.. కోహ్లీని అన్‌ఫాలో చేసిన దాదా..!

Tit for tat: టీమిండియా మాజీ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ మధ్య కోల్డ్ వార్ తారాస్థాయికి చేరింది.

Arun Chilukuri
Published on: 19 April 2023 12:51 PM IST
Sourav Ganguly Unfollows Virat Kohli on Instagram
X

Tit for tat: కోహ్లి, గంగూలీ మధ్య సోషల్ వార్.. కోహ్లిని అన్‌ఫాలో చేసిన దాదా..!

Tit for tat: టీమిండియా మాజీ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ మధ్య కోల్డ్ వార్ తారాస్థాయికి చేరింది. ఐపీఎల్ 2023లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య గత వారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ సందర్భంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు బయటపడ్డాయి. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ కి మెంటర్ గా సౌరవ్ గంగూలీ వ్యవహరిస్తుండగా, ఆర్సీబీ జట్టుకి కోహ్లీ ఆడుతున్నాడు. ఇక మ్యాచ్ జరుగుతున్న సమయంలో సౌరవ్ గంగూలీ వైపు కోహ్లీ గుర్రుగా చూడడం, అలాగే ఇరు జట్ల ఆటగాళ్లు, కోచ్ లు, సహాయసిబ్బంది షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటున్న సమయంలో గంగూలీకి విరాట్ షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ఈ వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

తాజాగా సౌరవ్ గంగూలీని విరాట్ కోహ్లీ తన ఇన్ స్టాగ్రామ్ లో అన్ ఫాలో చేశాడు. గంగూలీ కూడా టిట్ ఫర్ టాట్ అన్నట్లు కోహ్లీని తను అన్ ఫాలో చేశాడు. వీరిద్దరి మధ్యన వివాదం విరాట్ కోహ్లీ తన T20 కెప్టెన్సీని వదులుకున్నప్పటి నుంచి మొదలైనట్లు తెలుస్తోంది. కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి అప్పటి బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీయే కారణమని విరాట్ కోహ్లీ భావిస్తున్నట్లు అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి.

మాజీ బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన శర్మ స్టింగ్ ఆపరేషన్ లో సౌరవ్ గంగూలీకి విరాట్ కోహ్లీ అంటే నచ్చడని..అందుకే అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించామని చెప్పాడు. ఏదిఏమైనా, ఈ రాద్ధాంతం అంతా ముగిసిందనుకుంటున్న సమయంలో గంగూలీ, కోహ్లీ గ్రౌండ్ లో తారసపడడంతో మళ్లీ రాజుకున్నట్లయింది. ఇక మే 6న ఆర్ సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో రెండో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో ఇంకెన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story