Sourav Ganguly: గంగూలీకి మళ్లీ కరోనా పాజిటివ్.. డెల్టా ప్లస్ వేరియంట్ అన్న వైద్యులు..

Sourav Ganguly: బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మళ్లీ కరోనా బారిన పడ్డారు.

Arun Chilukuri
Published on: 2 Jan 2022 2:39 PM IST
Sourav Ganguly Tested Positive for Delta Plus Variant
X

Sourav Ganguly: గంగూలీకి మళ్లీ కరోనా పాజిటివ్.. డెల్టా ప్లస్ వేరియంట్ అన్న వైద్యులు..

Sourav Ganguly: బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మళ్లీ కరోనా బారిన పడ్డారు. అయితే ఈ సారి అతడికి కరోనా డెల్టా ప్లస్​ వేరియంట్​ సోకింది. శనివారం రాత్రి చేసిన పరీక్షల్లో దాదాకు పాజిటివ్​గా నిర్ధారణ అయినట్లు వుడ్‌లాండ్స్‌ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించి వుడ్ ల్యాండ్ ఆస్పత్రి వర్గాలు చెప్పిన వివరాలివి.. బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీకి తాజాగా నిర్వహించిన పరీక్షల్లో డెల్టాప్లస్ వేరియంట్ సోకినట్టు నిర్ధారణ అయింది.

ఈ మేరకు ఆసుపత్రి వర్గాలు శనివారం రాత్రి ప్రకటన చేశాయి. అయితే, కొవిడ్ లక్షణాలు, వ్యాధి తీవ్రత చాలా స్వల్పంగా ఉండటంతో ఈసారి ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేదని, వైద్యుల సూచన మేరకు గంగూలీ ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నారని వుడ్ ల్యాండ్ ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story