Sourav Ganguly: ఐసీసీ అధ్య‌క్ష పీఠంపై దాదా విముఖ‌త‌

Sourav Ganguly: ఐసీసీ అధ్య‌క్ష పీఠంపై దాదా విముఖ‌త‌
x

Sourav Ganguly: ఐసీసీ అధ్య‌క్ష పీఠంపై దాదా విముఖ‌త‌

Highlights

Sourav Ganguly: బీసీసీఐ అధ్య‌క్షుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఐసీసీ బాధ్యత‌లు చేప‌ట్టాడానికి విముఖ‌త వ్య‌క్తం చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఇటీవల ఐసీసీ అధ్యక్ష పద‌వీ ‌నుంచి శశాంక్ మనోహర్ వైదొలిగిన త‌రువాత ఆ పద‌వికి ఎన్నిక‌లు అనివార్యమైన సంగతి తెలిసిందే.

Sourav Ganguly: బీసీసీఐ అధ్య‌క్షుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఐసీసీ బాధ్యత‌లు చేప‌ట్టాడానికి విముఖ‌త వ్య‌క్తం చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఇటీవల ఐసీసీ అధ్యక్ష పద‌వీ ‌నుంచి శశాంక్ మనోహర్ వైదొలిగిన సంగతి తెలిసిందే. దీంతో ఆ పద‌వికి ఎన్నిక‌లు అనివార్యమయ్యాయి. ఈ ప‌ద‌వికి ఈ నెల 18 లోపు నామినేషన్ దాఖాలు చేయాల్సి ఉండ‌గా.. గంగూలీ మాత్రం నామినేషన్ వేయలేదు. అంతేకాకుండా బీసీసీఐ నుంచి మరే ఇతర వ్యక్తులు కూడా ఈ పోటీలో లేర‌ని తెలుస్తుంది. నామినేష‌న్ల ప‌రిశీల‌న త‌రువాత డిసెంబ‌ర్ లో కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని తెలిపారు.

కాగా, గంగూలీ ఐసీసీ బాధ్యతలు స్వీకరిస్తారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతానికి ఆ బాధ్యతలు తనకు వద్దని, భవిష్యత్తులో ఐసీసీపై దృష్టిని సారించవచ్చని, తనకు ఆ అవకాశం తప్పకుండా వస్తుందని భావించడం వల్లే గంగూలీ ప్రస్తుతం పోటీకి దూరంగా ఉన్నారని తెలుస్తోంది.

ఇదిలావుండగా, ఐపీఎల్ సీజన్ ముగిసిన తరువాత ఆస్ట్రేలియా పర్యటనకు భారత క్రికెట్ జట్టు పయనం కానున్న నేపథ్యంలో, తొలి టెస్ట్ పింక్ బాల్ తో అడిలైడ్ లో డే అండ్ నైట్ టెస్ట్ గా జరుగుతుందని గంగూలీ ప్రకటించారు. వచ్చే నెలలో ఆస్ట్రేలియా, ఇండియా మధ్య మూడు టీ-20లతో పాటు మూడు వన్డేలు, నాలుగు టెస్టులు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో మ్యాచ్ లు జరిగే తేదీలు మాత్రం ఇంకా ఖరారు కాలేదు. డే అండ్ నైట్ టెస్ట్ కు సంబంధించిన సమాచారాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా తమకు పంపిందని మాత్రం గంగూలీ స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories