Sourav Ganguly: ఐపీఎల్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన గంగూలీ

Sourav Ganguly: ముంబైలో కరోనా విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే.

Venkata Chari
Updated on: 5 April 2021 11:50 AM IST
Sourav Ganguly Conforms IPL 2021 As Per Schedule
X

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ

Sourav Ganguly: ముంబైలో కరోనా విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహించే ముంబై వాంఖేడ్ స్టేడియం సిబ్బందికి, అలాగే కొంతమంది ఆటగాళ్లకు కరోనా సోకడంతో ఈ ఏడాది ఐపీఎల్ నిర్శహిస్తారా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతుండటంతో.. ఆ రాష్ట్ర ప్రభుత్వం వారాంతాల్లో లాక్‌డౌన్ విధించబోతోంది. కాగా, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఐపీఎల్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పాడు. షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్ లు నిర్వహిస్తామని పేర్కొన్నాడు.

ఐపీఎల్ 2021 సీజన్ ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ జరుగనుంది. ముంబయిలో ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తమ క్యాంప్‌‌లను ఏర్పాటు చేశాయి. ఇందులో ముంబయి, కోల్‌కతా జట్లు త్వరలోనే క్యాంప్‌ని చెన్నైకి మార్చనుండగా.. మిగిలిన జట్లు అక్కడే వాంఖడే స్టేడియంలో మ్యాచ్ ఆడనున్నాయి.

ఇప్పటికిప్పుడు వేదికలు మారిస్తే..? జట్లని తరలించడం, మ్యాచ్‌ కోసం పిచ్‌ని సిద్ధం చేయడం చాలా కష్టంతో కూడుకున్నది. అందుకే.. షెడ్యూల్‌లో మార్పులు చేయబోమని గంగూలీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

Venkata Chari

Venkata Chari

Next Story