IPL Tickets: IPL టికెట్లు బ్లాక్లో అమ్ముతున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు అరెస్ట్

IPL Tickets: హైదరాబాద్ మాదాపూర్‌లో SOT పోలీసుల సోదాలు నిర్వహించారు.

Arun Chilukuri
Updated on: 19 April 2024 5:30 PM IST
Software Employees Arrested for Selling IPL Tickets on Block
X

IPL Tickets: IPL టికెట్లు బ్లాక్లో అమ్ముతున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు అరెస్ట్

IPL Tickets: హైదరాబాద్ మాదాపూర్‌లో SOT పోలీసుల సోదాలు నిర్వహించారు. ఐపీఎల్ టికెట్లు బ్లాక్‌లో అమ్ముతున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక్కో టికెట్ 10 వేల నుంచి 15 వేలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. SRH Vs RCB మ్యాచ్‌కి సంబంధించిన టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురి నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

పటాన్‌చెరు ఇస్నాపుర్ కు చెందిన మధుబాబు,సైనిక్ పురికి చెందిన మాథ్యూ రోడ్రిక్స్, గచ్చిబౌలి అంజయ్య నగర్ లో ఉండే నిజంతన్ ను మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు . వీరు ఒక్కో ఐపీఎల్ టికెట్ ను రూ.10 వేల నుంచి రూ. 15 వేలకు విక్రయిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story