Shubman Gill: విరాట్ కోహ్లీ రికార్డులపై కన్నేసిన శుభ్ మన్ గిల్, 49 పరుగులు చేస్తే చాలు

Shubman Gill: గుజరాత్ టైటాన్స్ యంగ్ ప్లేయర్ శుభ్ మన్ గిల్ ఐపీఎల్ 2023 సీజన్ లో బ్యాటుతో అదరగొడుతున్నాడు.

Jyothi
Published on: 27 May 2023 2:28 PM IST
Shubman Gill Eyeing On Kohlis Record
X

Shubman Gill: విరాట్ కోహ్లీ రికార్డులపై కన్నేసిన శుభ్ మన్ గిల్, 49 పరుగులు చేస్తే చాలు

Shubman Gill: గుజరాత్ టైటాన్స్ యంగ్ ప్లేయర్ శుభ్ మన్ గిల్ ఐపీఎల్ 2023 సీజన్ లో బ్యాటుతో అదరగొడుతున్నాడు. గత సీజన్ మాదిరే జీటీ విజయాల్లో ప్రస్తుత సీజన్ లో కూడా గిల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. గడిచిన ఏడాది కాలంగా శుభ్ మన్ గిల్ టీమిండియా తరపున కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్ పై 208 పరుగులు చేసి, వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన యువ ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

శుభ్ మన్ గిల్ కు టెండూల్కర్, కోహ్లీ అంత పెద్ద స్టార్ గా ఎదిగే నైపుణ్యం ఉందని పలువురు క్రికెటర్లు సైతం అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియెన్స్ తో జరిగిన క్వాలిఫయర్ 2లో సెంచరీ చేశాడు. 129 పరుగులు సాధించి ముంబై ఇండియన్స్ పై గుజరాత్ టైటాన్స్ కు భారీ విజయం దక్కేలా చేశాడు. ఇప్పటి వరకు 851 పరుగులు చేసి గిల్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా ఉన్నాడు. ఇక, సీఎస్కే తో జరిగే ఫైనల్ పోరులో కూడా ఇదే రీతిలో తన ఆటను ప్రదర్శిస్తే ఆరెంజ్ క్యాప్ తో పాటు అరుదైన రికార్డు కూడా గిల్ సొంతం చేసుకుంటాడు..

ఈ 16వ సీజన్ లో గిల్ ఇప్పటివరకు 3 సెంచరీలు సాధించాడు. ఫైనల్ బ్యాటిల్ లో సెంచరీ సాధిస్తే కింగ్ కోహ్లీ, జాస్ బట్లర్ సరసన నిలుస్తాడు. కోహ్లీ(2016), బట్లర్ (2022) 4 సెంచరీలు చేసి అత్యధిక శతకాలు సాధించిన ప్లేయర్లుగా రికార్డు పుటల్లోకి ఎక్కారు. గిల్ సెంచరీ చేస్తే వీరి సరసన నిలుస్తాడు. ఇక, ఈ యువ ఆటగాడిని మరో రికార్డు కూడా ఊరిస్తోంది. కోహ్లీని అధిగమించే అవకాశం ఉంది. అదేంటంటే, 900 మార్క్.

ఒక సీజన్ లో 900 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ పేరిట రికార్డ్ ఉంది. ప్రస్తుతం గిల్ ఖాతాలో 851 పరుగులు ఉన్నాయి. ఫైనల్ మ్యాచ్ లో 49 పరుగులు సాధిస్తే 900 మార్క్ ని అందుకుంటాడు. 123 పరుగులు చేస్తే కోహ్లీ (973 పరుగులు) రికార్డ్ ను సైతం గిల్ బ్రేక్ చేస్తాడు. ఇందుకు అతను 123 పరుగులు సాధించాల్సి ఉంటుంది. మరి, ఒంటి చేత్తో గుజరాత్ టీంను ఫైనల్స్ కు చేర్చిన ఈ స్టార్ క్రికెటర్ వ్యక్తిగత రికార్డులను సవరించడంతోపాటు జీటీకి కప్ కూడా అందిస్తాడేమో చూడాలి.

Jyothi

Jyothi

Next Story