Shreyas Iyer: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు శ్రేయాస్ అయ్యర్ గుడ్ బై..!?

* శ్రేయాస్ అయ్యర్ ని కెప్టెన్ గా కొనసాగించకపోవడమే ప్రధాన కారణమా..!?

Sandeep Reddy
Published on: 30 Oct 2021 3:59 PM IST
Shreyas Iyer Thinking to Leave the Delhi Capitals Team in IPL 2022
X

Shreyas Iyer: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు శ్రేయాస్ అయ్యర్ గుడ్ బై..!?

Shreyas Iyer: టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ శ్రేయాస్ అయ్యర్ రానున్న ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నుండి తప్పుకోనున్నట్లు తెలుస్తుంది. 2015లో శ్రేయాస్ అయ్యర్ ను రెండు కోట్ల 60 లక్షల రూపాయలతో వేలం పాటలో దక్కించుకుంది ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు. 2018లో గౌతమ్ గంభీర్ ఐపీఎల్ నుండి తప్పుకున్న తరువాత ఢిల్లీ కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రేయాస్ ఇటీవల జరిగిన ఐపీఎల్ లో గాయం కారణంగా ఐపీఎల్ కి దూరమవడంతో అతడి స్థానంలో రిషబ్ పంత్ ని నియమించింది ఢిల్లీ జట్టు యాజమాన్యం.

తిరిగి జట్టులోకి చేరిన రిషబ్ పంత్ కెప్టెన్ గా కొనసాగడం.. శ్రేయాస్ ని సాధారణ ఆటగాడిగానే కొనసాగించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు గుడ్ బై చెప్పి త్వరలో జరగనున్న ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొనాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే టీ20 ప్రపంచకప్ 2021 మ్యాచ్ లకు దూరమై టీమిండియాలో రిజర్వ్ ఆటగాడిగా ఉన్న శ్రేయాస్ అయ్యర్ ఇప్పటివరకు ఐపీఎల్ లో 87 మ్యాచ్ లలో 31.75 యావరేజ్ తో 124 స్ట్రైక్ రేట్ తో 2375 పరుగులు సాధించాడు. మరి రానున్న ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ వదిలి వెళ్ళాలనుకున్న శ్రేయాస్ అయ్యర్ ను మెగావేలంలో ఏ జట్టు దక్కించుకుంటుందో వేచి చూడాల్సిందే..!!

Sandeep Reddy

Sandeep Reddy

Next Story