Shreya Iyer: టెస్టు ర్యాంకింగ్స్‌లోకి శ్రేయస్.. 74వ స్థానంలో...

Shreya Iyer: బ్యాటింగ్, బౌలింగ్ టాప్-10లో ఇద్దరేసి టీమ్ ఇండియా క్రికెటర్లు

Sandeep Eggoju
Updated on: 2 Dec 2021 1:21 PM IST
Shreyas Iyer Enters Into Test Ranking List
X

శ్రేయాస్ అయ్యర్ (ఫైల్ ఇమేజ్)

Shreya Iyer: కివీస్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన భారత బ్యాటర్‌ శ్రేయస్ అయ్యర్‌ తొలిసారి టెస్టు ర్యాంకింగ్స్‌లో స్థానం సంపాదించాడు. అరంగేట్రం చేసిన తొలి టెస్టు మ్యాచ్‌లోనే సెంచరీ, హాఫ్ సెంచరీ సాధించిన శ్రేయస్ ఏకంగా బ్యాటర్ల జాబితాలో 74వ స్థానంలో నిలిచాడు. హాఫ్‌ సెంచరీలు బాదిన శుభ్‌మన్‌ గిల్‌, వృద్ధిమాన్‌ సాహా కూడా తమ ర్యాంకులను మెరుగుపర్చుకున్నారు. శుభ్‌మన్‌ ఆరు స్థానాలు పైకి ఎగబాకి 66వ స్థానానికి, వృద్ధిమాన్‌ సాహా తొమ్మిది స్థానాలను మెరుగుపరుచుకుని 99వ స్థానానికి చేరాడు.

ఇక బ్యాటింగ్‌ టాప్‌-10లో టీమ్‌ఇండియా నుంచి ఇద్దరు బ్యాటర్లు ఉన్నారు. 805 పాయింట్లతో రోహిత్ శర్మ ఐదో స్థానం, 775 పాయింట్లతో విరాట్ కోహ్లీ ఆరోస్థానంలో నిలిచారు. తొలి స్థానం జోయ్‌ రూట్ కాగా స్టీవ్‌ స్మిత్, కేన్‌ విలియమ్సన్, మార్నస్‌ లబుషేన్‌ తర్వాత స్థానాల్లో ఉన్నారు. అలాగే టాప్‌ టెన్‌లో ఇద్దరు భారత బౌలర్లు ఉన్నారు. కివీస్‌తో టెస్టులో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన రవిచంద్రన్‌ అశ్విన్‌ 840 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. బుమ్రా ఒక స్థానం కోల్పోయి పదో స్థానానికి పరిమితమయ్యాడు. ఆసీస్‌ బౌలర్‌ ప్యాట్‌ కమిన్స్‌ తొలి స్థానంలో నిలిచాడు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story