Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందే టీం ఇండియాకు బిగ్ షాక్

Shocking Blow to Team India Ahead of 2025 Champions Trophy Coach Morne Morkel to Return to South Africa
x

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందే టీం ఇండియాకు బిగ్ షాక్

Highlights

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ రేపు అంటే బుధవారం నుంచి ప్రారంభం కానుంది. టోర్నమెంట్ ప్రారంభానికి ముందే భారత జట్టుకు భారీ షాక్ ఎదురైంది.

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ రేపు అంటే బుధవారం నుంచి ప్రారంభం కానుంది. టోర్నమెంట్ ప్రారంభానికి ముందే భారత జట్టుకు భారీ షాక్ ఎదురైంది. మీడియా నివేదికల ప్రకారం.. భారత జట్టు ప్రధాన కోచ్ మోర్నే మోర్కెల్ దుబాయ్ నుండి తన స్వదేశమైన దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లిపోనున్నారు.. దీని వెనుక వ్యక్తిగత కారణాలు ఉన్నాయని తెలుస్తోంది.. శనివారం ముందుగా, మోర్నే మోర్కెల్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) చేరుకున్నారు... ఇదిలా ఉండగా, సోమవారం భారత జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో మోర్నే మోర్కెల్ కనిపించలేదు.. అయితే, మోర్నే మోర్కెల్ కు అసలు ఏమి జరిగిందో ఇంకా స్పష్టంగా తెలియలేదు? కానీ బహుశా మోర్నే మోర్కెల్ తండ్రి మరణించినట్లు సమాచారం అందుతోంది.

మోర్నే మోర్కెల్ మళ్ళీ భారత జట్టులో ఎప్పుడు చేరతాడు?

మోర్నే మోర్కెల్ తిరిగి భారత జట్టుతో చేరుతాడా లేదా అనేది స్పష్టమైన సమాచారం లేదు. ఛాంపియన్స్ ట్రోఫీ మధ్యలో అతను భారత జట్టులో తిరిగి చేరతాడా? లేక టోర్నమెంట్ సమయంలో అతను భారత జట్టుతో ఉండడా? అనే ప్రశ్నలపై సందేహాలున్నాయి. అయితే, దీనిపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక సమాచారం వెల్లడి కాలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ బుధవారం నుండి ప్రారంభమవుతుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు బంగ్లాదేశ్‌తో తన ప్రయాణం ప్రారంభించనుంది. గురువారం భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు బంగ్లాదేశ్‌తో తన ప్రచారాన్ని ప్రారంభిస్తుంది. ఫిబ్రవరి 20న భారత్, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరగనుంది. దీని తర్వాత, రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు పాకిస్తాన్, న్యూజిలాండ్‌తో ఆడనుంది. ఫిబ్రవరి 23న భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. దీని తర్వాత భారత జట్టు న్యూజిలాండ్‌తో తలపడుతుంది. మార్చి 2న భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories