Shoaib Malik: మరో పెళ్లి చేసుకున్న పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్

Shoaib Malik married Pakistani Actress Sana Javed
x

Shoaib Malik: మరో పెళ్లి చేసుకున్న పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్

Highlights

Shoaib Malik: 2010లో సానియామీర్జాను వివాహం చేసుకున్న షోయబ్ మాలిక్

Shoaib Malik: పాకిస్తాన్ క్రికెటర్, సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నారు. సానియా మీర్జాతో విడాకులు తీసుకుబోతున్నట్లు సోషల్‌మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ప్రస్తుతం అతడు పాక్ నటి సనా జావేద్‌తో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేశారు. సానియా మీర్జా నుంచి విడిపోయినట్లు వచ్చిన వార్తలకు బలం చేకూరేలా సోషల్‌మీడియాలో పోస్టుచేశారు షోయబ్ మాలిక్. కొంతకాలంగా సానియామీర్జా, షోయబ్ మాలిక్‌లు దూరంగా ఉంటున్నారు.

అప్పటి నుంచి వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియా కోడై కూసింది. ప్రస్తుతం షోయబ్ మాలిక్ పోస్టుతో వారిద్దరి మధ్య వైవాహిక జీవితానికి ఇక తెర తెరపడినట్టేనని స్పష్టమైంది. కాగా షోయబ్‌ను 2010లో సానియా మీర్జా వివాహం చేసుకున్నారు. వారికి ఒక బాబు సంతానం. అంతకుముందు 2002లో అయేషా సిద్ధిఖీని వివాహం చేసుకున్న షోయబ్.. 2010లో విడిపోయి సానియా మీర్జాను పెళ్లి చేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories