Shikhar Dhawan: బీసీసీఐ కీలక నిర్ణయం.. టీమిండియా కెప్టెన్ గా శిఖర్ ధావన్!

SA vs IND: స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగే వన్డే సీరిస్‌కు సారథ్య బాధ్యతలను ఓపెనింగ్ బ్యాటర్ శిఖర్ ధావన్ చేపట్టనున్నాడు.

Arun Chilukuri
Updated on: 12 Sept 2022 9:00 PM IST
Shikhar Dhawan To Lead India In ODIs Against South Africa
X

Shikhar Dhawan: బీసీసీఐ కీలక నిర్ణయం.. టీమిండియా కెప్టెన్ గా శిఖర్ ధావన్!

SA vs IND: స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగే వన్డే సీరిస్‌కు సారథ్య బాధ్యతలను ఓపెనింగ్ బ్యాటర్ శిఖర్ ధావన్ చేపట్టనున్నాడు. టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనే ప్లేయర్లకు రెస్ట్ ఇస్తున్న నేపథ్యంలో కెప్టెన్సీని ధావన్‌కు అప్పగించినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అక్టోబర్ 16 నుంచి టీ20 వరల్డ్ కప్‌ ఆస్ట్రేలియాలో ప్రారంభంకానుంది. సెప్టెంబర్ 28 నుంచి సౌతాఫ్రికాతో మూడు టీ20లు, మూడు వన్డేలను భారత్ ఆడనుంది. తిరువనంతపురంలో సెప్టెంబర్ 28న తొలి టీ20 జరగనుంది. రెండొవ టీ20 అక్టోబర్ 2న, 4న ఇండోర్‌లో మూడొవ టీ20 జరుగుతుంది. ఇక వన్డే సిరీస్ అక్టోబర్ 6 నుంచి ప్రారంభంకానుంది. ఆ టీమ్‌ను శిఖర్ ధావన్ లీడ్ చేస్తాడు. రాంచీ, ఢిల్లీలో అక్టోబర్ 9, 11న మూడొవ వన్డేలు జరుగనున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story