Shikhar Dhawan: ఇది 'బిగ్‌ బాస్ హౌస్‌' లానే ఉంది: శిఖర్ ధావన్

Shikhar Dhawan:  ఇది బిగ్‌ బాస్ హౌస్‌ లానే  ఉంది: శిఖర్ ధావన్
x
Highlights

Shikhar Dhawan : భార‌త్ లో జ‌ర‌గ‌వల్సిన ఐపీఎల్ 2020 క‌రోనా విజృంభ‌న‌తో యూఏఈ వేదిక‌గా జ‌రుగనున్న‌ది. ఈ టోర్నీ కోసం ప్ర‌పంచవ్యాప్తంగా ఎంతో మంది క్రికెట్ అభిమానులు ఉత్కంఠ‌గా వేచిచూస్తున్నారు.

Shikhar Dhawan: భార‌త్ లో జ‌ర‌గ‌వల్సిన ఐపీఎల్ 2020 క‌రోనా విజృంభ‌న‌తో యూఏఈ వేదిక‌గా జ‌రుగనున్న‌ది. ఈ టోర్నీ కోసం ప్ర‌పంచవ్యాప్తంగా ఎంతో మంది క్రికెట్ అభిమానులు ఉత్కంఠ‌గా వేచిచూస్తున్నారు. మ‌రో మూడు రోజుల్లో టోర్నీ ప్రారంభం కానున్న‌ది. ఈ టోర్నీకి బీసీసీఐ అత్యంత క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తా ఏర్పాటు చేసింది. క్రీడాకారుల‌పై క‌రోనా ప్ర‌భావం ప‌డ‌కుండా బ‌యో బ‌బుల్ వాతావ‌ర‌ణాన్ని ఏర్పాటు చేశారు. జట్లన్నీ బయో బబుల్ వాతావరణంలో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఈ త‌రుణంలో బయో బబుల్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఆస‌క్తి క‌ర వ్యాఖ్యాలు చేశారు.

'బయో బబుల్ వాతావరణం మాన‌సిక సామ‌ర్ధ్యాన్ని ప‌రీక్షించేలా.. దాదాపు బిగ్‌బాస్‌ రియాల్టీ షో లానే ఉంది. ఈ వాతావ‌రణం చాలా బాగుంది. అయితే ప్ర‌స్తుత ప‌రిస్థితిలో ఈ వాతావ‌ర‌ణాన్ని సవాలుగా కాకుండా.. సానుకూలంగా భావించాలి. నేనైతే సానుకూల ధృక్పథంతో సంతోషంగా ఉంటున్నా. సానుకూలంగా తీసుకుంటే ఈ బయోబబుల్ వాతావారణాన్ని ఆస్వాదించవచ్చు. లేకుంటే బాధితుడిగా మారి ఇబ్బందులు ఎదుర్కొవ‌ల్సివ‌స్తుందని శిఖర్ ధావన్ అన్నారు .

ప్ర‌స్తుత ప‌రిస్థితిల్లో ఎవ్వ‌రికీ ఎలాంటి ఔట్ లెట్ లేవు. రెస్టారెంట్‌‌లకు వెళ్ల‌డం, బయటి వారిని క‌ల‌వ‌డం వంటివి అసలే లేవు. కాబట్టి వీటిని ఈ వాతావ‌ర‌ణాన్ని ఆటగాళ్లు ఎలా స్వీకరిస్తారనేదే అసలు ప్రశ్న. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో యోగా, మెడిటేషన్ చేస్తూ శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉంటున్నాను. యోగా, మెడిటేషన్ వల్ల మానసిక ప్రశాంతతతో పాటు తన బ్యాటింగ్ సామర్థ్యం మెరుగైందన్నాడు. తోటి ఆట‌గాళ్ల‌కు కూడా అదే విష‌యాన్ని చెబుతున్నా.

'పాంటింగ్ ఓ గొప్ప కోచ్. అతని పర్యవేక్షణలో ఆడటాన్ని ఆస్వాదిస్తున్నా. అతను నాకు ఒక్కటే చెప్పాడు. నా బాడీ లాంగ్వెజ్‌ను బలంగా ఉంచుకోమన్నాడు. పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా మారుతాయి. ఒక మ్యాచ్‌లో ఓడామని నిరాశ చెందకూడదు. విజయం కోసం గట్టిగా శ్రమించాలి'అని ధావన్ తెలిపాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories