Shikhar Dhawan: దానిపై ఇంకా ఆశలు వదులు కోలేదు: శిఖర్‌ ధావన్‌

Shikhar Dhawan: దానిపై ఇంకా ఆశలు వదులు కోలేదు: శిఖర్‌ ధావన్‌
x
Highlights

Shikhar Dhawan: భారత టెస్టు క్రికెట్‌లో రీ ఎంట్రీపై తానింకా ఆశలు వదులు కోలేదని‌ సీనియర్‌ బ్యాట్స్‌మన్‌, ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ అన్నాడు. తాజాగా అతడు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.

Shikhar Dhawan: భారత టెస్టు క్రికెట్‌లో రీ ఎంట్రీపై తానింకా ఆశలు వదులు కోలేదని‌ సీనియర్‌ బ్యాట్స్‌మన్‌, ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ అన్నాడు. తాజాగా అతడు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. 2018లో ఇంగ్లాండ్‌లో చివరి టెస్టు మ్యాచ్ ఆడిన అతడు ఫామ్ ను కొనసాగించకపోవడంతో జట్టులో చోటు కోల్పోయాడు. దీంతో అప్పటి నుంచీ అతడు భారత్ తరుపున టెస్ట్ మ్యాచ్ ఆడలేదు. ఈ నేపథ్యంలోనే ఈ విషయంపై స్పందించిన గబ్బర్‌ తిరిగి టెస్టుల్లో ఆడేందుకు ఇంకా ఆసక్తితో ఉన్నానని చెప్పాడు.

'టెస్టు జట్టులో నేను లేనంత మాత్రాన దాన్ని లైట్ తీసుకున్నట్లు కాదు. ఛాన్స్ వచ్చినప్పుడు సత్తా చాటుతా. ఇంతకుముందు రంజీల్లో సెంచరీ చేసి వన్డేల్లోకి వచ్చినట్లే ఇప్పుడు కూడా అవకాశాలు వస్తే కచ్చితంగా వాటిని సద్వినియోగం చేసుకొని మళ్లీ టెస్టు జట్టులో చోటు సంపాదిస్తా. అందుకోసం విశ్వప్రయత్నం చేస్తా.ఇప్పుడైతే నా టార్గెట్ వచ్చే ఏడాది జరగబోయే టీ20 ప్రపంచ కప్‌. దాని కోసం హార్డ్ వర్క్ చేయాలి. ఫిట్‌గా ఉండాలి. నిలకడైన ఫామ్ తో రాణించాలి. ఇవన్నీ చేస్తే మిగతావన్నీ వాటంతటవే జరిగిపోతాయి' అని ధావన్‌ పేర్కొన్నాడు.

అనంతరం ఐపీఎల్‌పై స్పందించిన ఈ దిల్లీ క్యాపిటల్స్‌ బ్యాట్స్‌మన్‌.. తమ జట్టులో అనుభవ పూర్వకమైన ఆటగాళ్లు ఉన్నారన్నాడు. అలాగే ఈసారి అజింక్య రహానె, రవిచంద్రన్‌ అశ్విన్‌ లాంటి ఆటగాళ్లు జట్టులోకి రావడంతో.. వారి అనుభవం కూడా కలిసివస్తుందని చెప్పాడు. అయితే, జట్టంతా కలిసి ఆడితేనే విజయం వరిస్తుందని, ఆ విషయంలో యువ సారథి శ్రేయస్‌ అయ్యర్‌ మంచి పనిచేస్తున్నాడని మెచ్చుకున్నాడు. గతేడాది అతడు జట్టును అద్భుతంగా నడిపించాడని ధావన్‌ పేర్కొన్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories