IPL 2020: కరోనాతో పోరాడ‌గ‌ల‌ను: శిఖ‌ర్ ధావ‌న్

IPL 2020: కరోనాతో పోరాడ‌గ‌ల‌ను: శిఖ‌ర్ ధావ‌న్
x
Highlights

IPL 2020: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2020 రంగం సిద్దమైంది. ఇప్ప‌టికే షెడ్యూల్ కూడా వ‌చ్చేసింది. ఈ త‌రుణంలో టీమిండియా సీనియర్ ఓపెనర్, ఢిల్లీ క్యాపిట‌ల్స్ బ్యాట్స్‌మన్‌ శిఖ‌ర్ ధావ‌న్ ఆస‌క్తి కర వ్యాఖ్య‌లు చేశారు

IPL 2020: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2020 రంగం సిద్దమైంది. ఇప్ప‌టికే షెడ్యూల్ కూడా వ‌చ్చేసింది. ఈ త‌రుణంలో టీమిండియా సీనియర్ ఓపెనర్, ఢిల్లీ క్యాపిట‌ల్స్ బ్యాట్స్‌మన్‌ శిఖ‌ర్ ధావ‌న్ ఆస‌క్తి కర వ్యాఖ్య‌లు చేశారు. ఒక‌వేళ త‌న‌కు క‌రోనా వైరస్ సోకినా.. దానిని జ‌యించే శ‌క్తి త‌న శ‌రీరానికి ఉంద‌ని అన్నారు. ఐపీఎల్ 2020 కోసం గత నెలలో యూఏఈ వెళ్లిన ఢిల్లీ క్యాపిట‌ల్స్.. క్వారంటైన్ పూర్తిచేసుకుని ప్రాక్టీస్ చేస్తోంది.

'నా శరీరంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నేను ఆడటం పట్ల ఎప్పుడూ భయపడలేదు. కరోనా వైర‌స్ సోకుతుంద‌ని నాకు తెలుసు. కానీ నేను దానితో పోరాడ‌గ‌ల‌ను. నాకు నమ్మకం ఉంది. బీసీసీఐ, సంబంధిత ఫ్రాంచైజీలు నిర్ధేశించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ఆట‌గాళ్లంద‌రూ క‌చ్చితంగా పాటిస్తున్నారు. నేను కూడా 8-9 సార్లు క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నా. అందుకే జట్టులోని అందరం సురక్షితంగా ఉన్నాం. ఇకపై కూడా అలానే ఉండాలి. మా కదలికలు పరిమితం చేయబడ్డాయి. ఈ క‌ఠిన‌మైన స‌మ‌యంలో కూడా బీసీసీఐ ఇంత పెద్ద టోర్నీ నిర్వ‌హించ‌డం నిజంగా అభినంద‌నీయం' అని శిఖర్ ధావన్ పేర్కొన్నాడు.

అంద‌రం క‌లిసి క‌ట్టుగా పోరాడ గ‌ల‌మ‌న్న న‌మ్మ‌కం ఉంది. ఈసారి క‌ప్ గెలుస్తామ‌ని అన్నారు. ఈసారి జ‌ట్టులోకి సీనియర్ ఆటగాడు అంజిక్య ర‌హానే, రవిచంద్రన్ అశ్విన్ వంటి మేటి ఆటగాళ్లు ఉన్నారు. ఈ సారి గ‌బ్బ‌ర్ ఐపీఎల్‌ 2020లో ఏవిధంగా రెచ్చిపోతాడో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories