Shikhar Dhawan: గబ్బర్ ఖాతాలో అరుదైన రికార్డు

Venkata Chari
Published on: 23 March 2021 6:25 PM IST
Shikhar Dhawan Completes 5000 Runs in Asia
X

శిఖర్ ధావన్ (ఫొటో ట్విట్టర్)

Shikhar Dhawan: ఇంగ్లండ్‌తో నేడు జరుగుతున్న తొలి వన్డేలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్న టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ (98) అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఆసియాలో అత్యధిక రన్స్ చేసిన టీమిండియా లెఫ్ట్ హ్యాండ్‌ బ్యాట్స్‌మెన్ల జాబితాలో గబ్బర్ 5వ స్థానంలో నిలిచాడు.

ఈ జాబితాలో సౌరవ్ గంగూలీ (10589), యువరాజ్ సింగ్ (7954), గౌతమ్ గంభీర్ (7327), సురేష్ రైనా (5027) గబ్బర్ కంటే ముందున్నారు. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్‌ ద్వారా ధావన్‌ ఆసియాలో 5000 పరుగులు పూర్తి చేశాడు. ఓవరాల్‌గా(అన్ని ఫార్మాట్లు కలిపి) అంతర్జాతీయ క్రికెట్‌లో 12000కు పైగా పరుగులు సాధించాడు. ఇందులో 24 సెంచరీలు, 48 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Venkata Chari

Venkata Chari

Next Story