Shikhar Dhawan Divorce: భార్య అయేషాకి విడాకులు ఇచ్చిన భారత క్రికెటర్ శిఖర్ ధావన్

భార్య అయేషాకి విడాకులు ఇచ్చిన భారత క్రికెటర్ శిఖర్ ధావన్

Sandeep Reddy
Updated on: 8 Sept 2021 11:19 AM IST
Shikhar Dhawan and ayesha Divorce after 8 Years of Marriage Relation
X

: భార్య అయేషాకి విడాకులు ఇచ్చిన భారత క్రికెటర్ శిఖర్ ధావన్ (ట్విట్టర్ ఫోటో)

Shikhar Dhawan Divorce: టీమిండియా డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ తన భార్య అయేషా ముఖర్జీ కి విడాకులు ఇచ్చి తన 9 ఏళ్ళ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పాడు. ఈ విషయాన్నీ స్వయంగా శిఖర్ భార్య అయేషా ముఖర్జీ తన ఇంస్టాగ్రామ్ వేదికగా తెలిపింది. శిఖర్ ధావన్ ని 2012లో రెండో పెళ్లి చేసుకున్న అయేషాకి అంతకు ముందే ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. శిఖర్ తో పెళ్లి తర్వాత మగ బిడ్డకి జన్మనిచ్చిన అయేషా తాజాగా రెండో పెళ్ల్లి కూడా ఇలా విడాకులు అవడంతో తన భవిష్యత్తుపై భయాలు నెలకొన్నట్లు తెలిపింది.

బాక్సింగ్ క్రీడాకారిణి అయిన అయేషాకు ఫేస్‌బుక్ ద్వారా శిఖర్ ధావన్ పరిచయమయ్యాడు. మొదట రిక్వెస్ట్ చేసిన సరిగ్గా తెలియక ఓకే చేయకపోవడం ఆ తరువాత కొంతమంది క్రీడాకారులు చెప్పడంతో రిక్వెస్ట్ ఓకే చేయడంతో శిఖర్, అయేషా చాటింగ్ చేయడం మొదలుపెట్టడం అల కొద్ది రోజులకే ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. ఇక ప్రస్తుతం శిఖర్ ధావన్ వయసు 35 కాగా తనకంటే 11 ఏళ్ళు పెద్దదైన అయేషా ముఖర్జీని 46 ప్రేమించి రెండో పెళ్లి చేసుకోవడం అది కాస్త పట్టుమని పదిఏళ్ళు కూడా నిలువకపోవడంతో ఇపుడు సోషల్ మీడియాలో వీరి విడాకుల సంగతి హాట్ టాపిక్ గా మారింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story