విధి అంటే ఇదేనేమో.. సహచరుడి మృతికి సంతాపం తెలిపిన కొద్ది గంటలకే..

Shane Warne Last Tweet on Rod Marsh Demise
x

విధి అంటే ఇదేనేమో.. సహచరుడి మృతికి సంతాపం తెలిపిన కొద్ది గంటలకే..

Highlights

Shane Warne: క్రికెట్ లెజెండ్స్‌లో ఒకడైన ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ కన్నుమూశాడు.

Shane Warne: క్రికెట్ లెజెండ్స్‌లో ఒకడైన ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ కన్నుమూశాడు. హార్ట్‌ఎటాక్‌ రావడంతో షేన్‌వార్న్‌ ఒక్కసారిగా కుప్పుకూలిపోయాడు. అయితే శుక్ర‌వారం ఉద‌యం త‌న దేశానికే చెందిన సీనియర్ మోస్ట్ క్రికెట‌ర్‌, ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీప‌ర్ రామ్ మార్ష్ మృతికి సంతాపం తెలిపిన 12 గంట‌ల్లోనే వార్న్ మృతి చెందాడు. సాటి క్రికెట‌ర్‌కు క‌న్నీటి నివాళి అర్పించిన కొన్ని గంటల్లోనే వార్న్ మృతి చెంద‌డం నిజంగా పెద్ద విషాద‌మే.

ఆస్ట్రేలియా మాజీ వికెట్‌ కీపర్‌ రాడ్ మార్ష్‌ ఈ ఉదయం గుండెపోటుతో మరణించారు. ఆయన మరణానికి సంతాపం తెలుపుతూ షేన్‌ వార్న్‌ ట్వీట్‌ చేశాడు ' రాడ్‌ మార్ష్‌ మృతి చెందాడన్న వార్త వినడం బాధాకరం. క్రికెట్‌లో ఆయనో దిగ్గజం. చాలామంది యువ ఆటగాళ్లకు మార్ష్‌ ఓ స్ఫూర్తి. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి' అని అందులో రాసుకొచ్చారు. ఈ ట్వీట్‌ చేసిన 12 గంటల తర్వాతే వార్న్‌ కన్నుమూశాడు. అతడు చివరగా చేసిన ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది.


Show Full Article
Print Article
Next Story
More Stories