మోదీపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు

మోదీపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు
x
ఆఫ్రీది
Highlights

పాకిస్థాన్‌ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్‌ అఫ్రిది భారత ప్రధాని నరేంద్రమోదీపై కీలక వ్యాఖ్యలు చేశారు.

పాకిస్థాన్‌ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్‌ అఫ్రిది భారత ప్రధాని నరేంద్రమోదీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ అధికారంలో ఉన్నంత వరకు భారత్ పాక్ మధ్య క్రికెట్‌ ఉండబోదని అఫ్రిది ఆరోపిస్తున్నాడు. మోదీ తిరోగమన ఆలోచనా ధోరణితో ఉన్నారని వ్యాఖ్యానించారు.

ఈమేరకు మోదీ అధికారంలో ఉన్నంత వరకు భారత్‌ నుంచి పాకిస్థాన్‌కు స్పందనా రాదు. భారతీయులు సహా మనందరికీ మోదీ ఎలా ఆలోచిస్తారో తెలుసు. ఒకరిదేశంలో మరొకరు ప్రయాణించాలని సరిహద్దులకు రెండు వైపులా ఉన్నవారు భావిస్తున్నారు. అసలు భారత ప్రధాని మోదీ ఎజెండా ఏంటో, ఏం చేయాలనుకుంటున్నారో అర్థం కావడం లేదని అన్నారు.

మోదీపై అవాకులు చవాలకులు పేలుస్తో్న్న అఫ్రిదికి ఉగ్రవాదం, చొరబాట్లు, పాకిస్థాన్ ఆర్మీ నిబంధనలు ఉల్లంఘినపై మాట్లాడకపోవడం గమనార్హం.గతంలోనూ భారత్‌, కశ్మీర్‌ రాజకీయాల అడ్డగోలు వాదనలు చేశాడు. 2012లో భారత్‌, పాక్‌ చివరి ద్వైపాక్షిక సిరీస్‌ ఆడాయి. పాక్ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని అరికట్టేంత వరకు ఎలాంటి సంబంధాలు, చర్చలు ఉండబోవని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories