Shahid Afridi: పాక్ మాజీ కెప్టెన్ అఫ్రీదీ కుమార్తె పెళ్లి.. వరుడు కూడా క్రికెటరే

Shahid Afridi: పాకిస్థాన్ మాజీ సారథి షాహిద్ అఫ్రీదీ కూతురుకు అక్సా వివాహం నిశ్ఛయమైందని తెలుస్తోంది.

Samba Siva Rao
Published on: 8 March 2021 4:15 PM IST
shaheen shah afridi to get engaged shahid afridi
X

shahid afridi

Shahid Afridi:పాకిస్థాన్ మాజీ సారథి షాహిద్ అఫ్రీదీ కూతురుకు అక్సా వివాహం నిశ్ఛయమైందని తెలుస్తోంది. వరుడు కూడా ఓ ప్రముఖ క్రికెటర్ అని సమాచారం. పాక్ క్రికెట్ జట్టు పేసర్ షాహీన్ షా అఫ్రిదీకి అక్సా అఫ్రిదీ షానిచ్చి వివాహం చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. నిశ్చితార్థానికి ఇప్పటికే తేదీని కూడా ‌ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అఫ్రిదీకి మొత్తం ఐదుగురు కూతుళ్లు ఉన్నారు. అక్సా, అన్షా, అజ్వా, అస్మరా, ఆర్వా. వీరిలో పెద్ద కుమార్తె అక్సా. అయితే షాహీన్, అక్సాలకు 20 ఏళ్లే కావడం విశేషం.

ఈ సందర్భంగా అధికారికంగా షాహిద్ అఫ్రీదీ ట్వీట్ చేశారు. 'గత కొన్ని నెలలుగా రెండు కుటుంబాల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. మా అభ్యర్థనను అఫ్రిదీ కుటుంబం అంగీకరించింది' అని‌ అయాజ్‌ చెప్పారు. షాహిద్ అఫ్రిదీ కూడా తన కూతురు పెళ్లి విషయాన్ని ధ్రువీకరించాడు. ఈ సందర్భంగా అఫ్రీది ఓ ట్వీట్ చేశాడు. 'షాహీన్ అఫ్రిదీ కుటుంబం నా ఫ్యామిలీని సంప్రదించింది. రెండు కుంటుంబాలు టచ్ లో ఉన్నాయి. పెళ్లిల్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి. అల్లా దయదలిస్తే.. ఈ పెళ్లి జరుగుతుంది. షాహీన్ అఫ్రిదీ భవిష‌్యత్తు బాగుండాలని కోరుకుంటున్నా' అని అఫ్రిదీ ట్వీట్ లో పేర్కొన్నాడు. వివాహం నిశ్చయం అయినట్లు స్వయంగా షాహీన్ షా అఫ్రిదీ తండ్రి అయాజ్ వెల్లడించారు. గత కొన్నినెలలుగా షాహిద్ అఫ్రిదీ కుటుంబంతో చర్చలు జరిపినట్లు ఆయన తెలిపారు.

షాహీన్ అఫ్రిదీ 2018లో పాక్ జట్టులో ఆరంగేట్రం చేశారు. షాహీన్ అఫ్రిదీ అనతికాలంలో జట్టులో కీలక బౌలర్ గా ఎదిగాడు. ఈ ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ మూడు ఫార్మాట్లలోనూ రెగ్యులర్ ఆటగాడిగా మారాడు. షాహీన్ ఇప్పటి వరకూ 15 టెస్టులు, 22 వన్డేలు, 21టీ20 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లో(psl)ఇద్దరూ కలిసి ప్రాతినిధ్యం వహించాడు. షాహీన్‌ లాహోర్‌ క్యూలాండర్స్‌కు.. షాహిద్‌ ముల్తాన్‌ సుల్తాన్‌కు ప్రాతినిధ్యం వహించారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story