Chahar - Guptill: కంటిచూపుతో రెచ్చగొట్టిన గప్టిల్.. కన్నెర్ర చేసిన చహార్

*భారత బౌలర్ దీపక్ చహార్, కివీస్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ మధ్య లుక్ వార్

Sandeep Reddy
Updated on: 18 Nov 2021 1:36 PM IST
Serious Look war Between Deepak Chahar and Guptill in IND vs NZ T20 Match Yesterday 17 11 2021
X

Deepak Chahar - Guptill: కంటిచూపుతో రెచ్చగొట్టిన గప్టిల్.. కన్నెర్ర చేసిన దీపక్ చహార్

Deepak Chahar - Guptill: జైపూర్ వేదికగా టీమిండియా - న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి టీ20లో మ్యాచ్ లో అయిదు వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో భారత బౌలర్ దీపక్ చహార్, కివీస్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ మధ్య లుక్ వార్ నడించింది. మొదట బ్యాటింగ్ కి దిగిన కివీస్ జట్టు ఆరంభంలోనే మిచెల్ వికెట్ కోల్పోయిన.. గప్టిల్, చాంప్మెన్ తమ బ్యాటింగ్ తో కివీస్ కి మంచి స్కోర్ అందించారు.

అయితే దీపక్ చహార్ వేసిన 18వ ఓవర్లో మొదటి బంతిని సిక్సర్ గా మలిచిన గప్టిల్ స్టాండ్స్ వైపు వెళ్ళిన బంతి వైపు కూడా చూడకుండా సీరియస్ గా దీపక్ చహార్ వైపు ఒక లుక్ ఇచ్చి రెచ్చగొట్టాడు. ఇక ఆ తరువాతి బంతిని కాస్త తక్కువ వేగంతో అదే విధంగా వేయడంతో షాట్ ఆడటానికి ప్రయత్నించిన బంతి గాల్లోకి లేవడంతో బౌండరీ లైన్ వద్ద ఉన్న శ్రేయాస్ అయ్యర్ అద్భుత క్యాచ్ పట్టడంతో గప్టిల్ ఔటైయ్యాడు.

అనంతరం దీపక్ చహార్ కూడా ఎలాంటి సంబరాలు చేసుకోకుండా గప్టిల్ వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చాడు. ఇలా అనవసరంగా దీపక్ చహార్ ఇగో టచ్ చేసి మరీ గప్టిల్ తన కోపానికి తానే శత్రువు అన్నట్టుగా అవుట్ అయి మూల్యం చెల్లించుకున్నాడు. తాజాగా ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవడంతో అభిమానులు గప్టిల్ పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇక మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా 1-0 తో టీమిండియా ఆధిక్యంలో నిలిచింది.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story