Sehwag: సన్ రైజర్స్ బ్యాటింగ్ చూస్తూ నిద్రపోయా..

* హైదరాబాద్ జట్టు స్లో బ్యాటింగ్ తో మ్యాచ్ చూస్తూ నిద్రపోయానని సెహ్వాగ్ పంచ్

Sandeep Reddy
Published on: 4 Oct 2021 6:05 PM IST
Sehwag Satirical Comments on Sunrisers Hyderabad Slow Batting in SRH vs KKR IPL 2021
X

వీరేంద్ర సెహ్వాగ్ (ట్విట్టర్ ఫోటో)

Sehwag: ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్ - కలకత్తా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ పై భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ సెటైర్లు విసిరారు. నిన్న జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ నెమ్మదైన బ్యాటింగ్ చూస్తూ చూస్తూనే నిద్రలోకి జారుకున్నానని, అప్పటికే నెమ్మదైన పిచ్ పై మరింత నెమ్మదిగా హైదరాబాద్ చేసిన బ్యాటింగ్ తనకి నిద్ర మాత్రలుగా మారాయని చెప్పుకొచ్చాడు.

సన్ రైజర్స్ బ్యాటింగ్ లో ఓపెనర్లు సాహా, జాసన్ రాయ్ త్వరగానే ఔటై పెవిలియన్ చేరగా ఆ తరువాత బ్యాటింగ్ కి దిగిన వచ్చిన విలియమ్సన్, సమద్ తరువాత వచ్చిన ఆటగాళ్ళ స్లో బ్యాటింగ్ ను చూసి అటు అభిమానులు కూడా విసుగు చెందారని ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. ఆదివారం జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో కలకత్తా విజయం సాధించగా కలకత్తా జట్టులో ఓపెనర్ శుభ్ మాన్ గిల్ అర్ధ సెంచరీ సాధించి తన సత్తా చాటాడు. కలకత్తా బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తి, టిమ్ సౌథి, శివమ్ మావి తల రెండు వికెట్లను పడగొట్టారు.

ఇక ఇప్పటికే పాయింట్స్ టేబుల్ లో కేవలం రెండు విజయాలతో చివరి స్థానంలో నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ ఏడాది ఐపీఎల్ లో పేలవ ప్రదర్శన కనబరించింది. ప్రస్తుతం హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ పై సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story