IPL 2023: కింగ్ కోహ్లీతో లఖ్ నవూ టీమ్ కాంప్రమైజ్

IPL 2023: ఐపీఎల్ 2023 సీజన్ చాలా ఉత్కంఠభరితంగా సాగాయి.

Dhatripriya
Updated on: 24 May 2023 10:01 AM IST
See You Next Season Lucknow Share Cryptic For RCB
X

IPL 2023: కింగ్ కోహ్లీతో లఖ్ నవూ టీమ్ కాంప్రమైజ్ 

IPL 2023: ఐపీఎల్ 2023 సీజన్ చాలా ఉత్కంఠభరితంగా సాగాయి. లీగ్ దశ ముగిసి ఫ్లే ఆఫ్స్ కు తెర లేచింది. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ , లఖ్ నవూ సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ ఫ్లే ఆఫ్స్ కు అర్హత సాధించాయి. ఇదిలా ఉంటే, లీగ్ దశలో ఎన్నో రికార్డులు నమోదు కావడంతో పాటు వివాదాలు చెలరేగాయి.

ముఖ్యంగా లఖ్ నవూ సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన గొడవ బాగా దుమారం రేపింది. కోహ్లీ వర్సెస్ గంభీర్, నవీన్ ఉల్ హక్ మధ్య గొడవ సోషల్ మీడియాలోనూ సెగలు పుట్టించింది. వీరిపై బీసీసీఐ ఫైన్ విధించినా..వివాదం మాత్రం సద్దుమణగలేదు. కోహ్లీని ఉద్దేశించి నవీన్ ఉల్ హక్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఉన్నాడు. అతడిని కోహ్లీ అభిమానులు టీజ్ చేస్తూనే ఉన్నారు.

ఫ్లే ఆఫ్స్ కు చేరుకోవడంతో కోహ్లీతో గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టే దిశగా లఖ్ నవూ సూపర్ జెయింట్స్ యాజమాన్యం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే, కాంప్రమైజ్ అవుదాం అనే అర్థం వచ్చేలా గివ్ ఇట్ టేక్ ఇట్ లెట్స్ లీవ్ ఇట్ అని లఖ్ నవూ టీమ్ ట్వీట్ చేసింది. అంతేకాదు, చక్కటి పోరాట పటిమను ప్రదర్శించారు..మళ్లీ వచ్చే సీజన్ లో కలుద్దామంటూ ఆర్సీబీని ఉద్దేశిస్తూ ట్వీట్ చేసింది. మరి లఖ్ నవూ టీమ్ ట్వీట్ తో గొడవకు ఫుల్ స్టాప్ పడుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది. అయితే లఖ్ నవూ ట్వీట్ కి వచ్చే సీజన్ లో సమాధానం చెబుతామంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.


Dhatripriya

Dhatripriya

Next Story