IND vs ENG: రెండో రోజు ఇంగ్లండ్‌పై 175 పరుగుల ఆధిక్యంలో భారత్

IND vs ENG: రాణించిన కేఎల్ రాహుల్, యశస్వి, జడేజా

Shekhar G
Published on: 26 Jan 2024 7:50 PM IST
Secondary Team India And England First Cricket Test Match At Uppal Stadium
X

IND vs ENG: రెండో రోజు ఇంగ్లండ్‌పై 175 పరుగుల ఆధిక్యంలో భారత్

IND vs ENG: హైదరాబాద్‌లోని ఉప్పల్‌ మైదానం వేదికగా భారత్ - ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌పై భారత్ 175 పరుగుల ఆధిక్యంతో కొనసాగుతోంది. ఓవర్‌నైట్‌ 119/1 స్కోరుతో రెండో రోజు ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్‌... ఆట ముగిసే సమయానికి 421/7 స్కోరుతో నిలిచింది. 81 పరుగులతో రవీంద్ర జడేజా, 35 పరుగులతో అక్షర్ పటేల్ క్రీజ్‌లో ఉన్నారు.

కేఎల్ రాహుల్ 86, యశస్వి జైస్వాల్ 80 పరుగులతో పాటు హాఫ్ సెంచరీలు సాధించారు. శ్రీకర్ భరత్ 41, శ్రేయస్‌ అయ్యర్ 35, రోహిత్ శర్మ 24, శుభ్‌మన్‌ గిల్ 23 పరుగులు చేసి ఫర్వాలేదనిపించారు. రవిచంద్రన్ అశ్విన్‌ ఒక పరుగు చేసి విఫలమయ్యాడు. ఇంగ్లండ్‌ బౌలర్లు టామ్‌ హార్ట్‌లే 2, జో రూట్ 2, జాక్‌ లీచ్, రెహాన్‌ చెరో వికెట్‌ తీశారు. అంతకుముందు ఇంగ్లండ్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.

Shekhar G

Shekhar G

Next Story