మొతేరా క్రికెట్ స్టేడియానికి ప్రధాని మోడీ పేరు

Arun Chilukuri
Published on: 24 Feb 2021 5:33 PM IST
మొతేరా క్రికెట్ స్టేడియానికి ప్రధాని మోడీ పేరు
X

మొతేరా క్రికెట్ స్టేడియానికి ప్రధాని మోడీ పేరు

ఇంగ్లండ్‌‌-టీమిండియా మధ్య జరుగుతున్న మూడో టెస్టుకు మొతేరా స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది. ఈ స్టేడియం ఓపెనింగ్‌‌కు సంబంధించి నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పాల్గొన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీసీసీఐ సెక్రటరీ జై షా, స్పోర్ట్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచంలో అతిపెద్దదైన క్రికెట్ స్టేడియమైన సర్దార్ పటేల్ క్రికెట్ స్టేడియంకు ప్రధాని మోడీ పేరుతో తిరిగి నామకరణం చేశారు. మొతేరా స్టేడియానికి ఇంతకుముందు సర్దార్ పటేల్ స్టేడియంగా పేరు ఉండగా.. ఇప్పుడు సర్దార్ పటేల్‌ పేరును స్పోర్ట్స్ కాంప్లెక్స్‌‌కే పరిమితం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story