Anaya Bangar: సంజయ్ బంగర్ కుమార్తె అనయ కన్నీటి గాథ.. క్రీడా ప్రపంచంలో లింగ వివక్ష!

Sanjay Bangars Daughter Anaya Reveals Shocking Experiences with Cricketers
x

Anaya Bangar: సంజయ్ బంగర్ కుమార్తె అనయ కన్నీటి గాథ.. క్రీడా ప్రపంచంలో లింగ వివక్ష!

Highlights

Anaya Bangar: భారత క్రికెట్ జట్టు మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ కుమార్తె అనయ బంగర్ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.

Anaya Bangar: భారత క్రికెట్ జట్టు మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ కుమార్తె అనయ బంగర్ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో అనయ మాట్లాడుతూ..కొంతమంది క్రికెటర్లు తనకు అసభ్యకరమైన ఫోటోలు పంపమని అడిగారని బాంబు పేల్చారు. అంతేకాదు, లింగమార్పిడి చేయించుకునే ముందు క్రికెట్ ఆడిన అనయ (గతంలో ఆర్యన్), తన తండ్రి కూడా క్రికెట్ ఆడొద్దని చెప్పారని వెల్లడించారు. ఆ నిర్ణయానికి గల కారణాలను కూడా ఆయన వివరించినట్లు ఆమె గుర్తు చేసుకున్నారు. యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్ వంటి యువ క్రికెటర్లతో దేశవాళీ క్రికెట్‌లో ఆడిన అనుభవం ఉన్న అనయకు, ఐసీసీ నిబంధనల కారణంగా క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆమె జీవితంలోని కొన్ని చీకటి కోణాలను ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ అనయ తన తండ్రి గురించి మాట్లాడటానికి ఇష్టపడలేదు. "నేను ఈ ఇంటర్వ్యూలో మా నాన్న గురించి మాట్లాడాలని అనుకోవడం లేదు" అని ఆమె స్పష్టం చేశారు. అయితే, ఇంటర్వ్యూయర్ ఆమె గతంలో మాట్లాడిన వీడియోలు పబ్లిక్‌గా అందుబాటులో ఉన్నాయని గుర్తు చేశారు. "లేదు. మీరు మాట్లాడిన వీడియోలు పబ్లిక్‌గా అందుబాటులో ఉన్నాయి. నేను కేవలం వాటిని ప్రస్తావించాను" అని ఆయన అన్నారు.

దీనికి అనయ స్పందిస్తూ, ఆ విషయాలు తనకు తెలుసని, కానీ ఇప్పుడు వాటి గురించి మళ్లీ ఎందుకు మాట్లాడాలని ప్రశ్నించారు. "అవును, ఆ విషయం నాకు తెలుసు. కానీ, మళ్లీ ఎందుకు ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకోవడం? క్రికెట్‌లో నాకు అవకాశం లేదని మా నాన్న అన్నారు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. క్రికెట్‌లో అవకాశాలు లేవని తెలిసిన ఒకానొక సమయంలో తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని కూడా అనయ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. "ఒక దశలో ఆత్మహత్య చేసుకుందామనుకున్నా. ప్రపంచమంతా నాకు వ్యతిరేకంగా ఉందనిపించింది. నేను అమ్మాయిగా మారడం వల్లే నాకు అవకాశం లేదు. కనీసం అవకాశాలు, హక్కులు కూడా లేవనిపించింది" అని ఆమె కన్నీటితో అన్నారు. కుటుంబం పరంగా తనకు కొంత స్థలం ఉన్నప్పటికీ, సమాజంలో క్రికెట్‌లో మాత్రం తనకు ఎలాంటి అవకాశం లేదని ఆమె బాధను వ్యక్తం చేశారు.

అనయ చేసిన ఈ వ్యాఖ్యలు క్రీడా ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒకప్పుడు ఎంతో మంది యువ క్రికెటర్లకు శిక్షణ ఇచ్చిన సంజయ్ బంగర్ కుమార్తె ఇలాంటి ఆరోపణలు చేయడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. లింగమార్పిడి చేసుకున్న తర్వాత ఒక మహిళగా క్రికెట్‌లో కొనసాగడానికి ఎదురైన ఇబ్బందులను, సమాజం నుండి ఎదురైన ప్రతికూలతను అనయ తన మాటల్లో వ్యక్తం చేశారు. కొంతమంది క్రికెటర్లు అసభ్యకరమైన ఫోటోలు పంపమని అడగటం ఆమె ఎదుర్కొన్న వేధింపులకు అద్దం పడుతోంది. ఈ అంశాలపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. ఒక యువ క్రీడాకారిణి తన జీవితంలో ఎదుర్కొన్న ఈ కష్టాలు సమాజంలో లింగమార్పిడి చేసుకున్న వ్యక్తుల పట్ల ఉన్న దృక్పథాన్ని మరోసారి ప్రశ్నార్థకం చేస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories