Sania Mirza: ముగిసిన సానియా ఫేర్‌వెల్ మ్యాచ్.. కంటతడిపెట్టిన సానియా

Sania Mirza: సానియా మ్యాచ్ చూసేందుకు తరలి వచ్చిన అభిమానులు

Dhatripriya
Published on: 5 March 2023 1:19 PM IST
Sania Mirza FareWell Match Completed
X

Sania Mirza: ముగిసిన సానియా ఫేర్‌వెల్ మ్యాచ్.. కంటతడిపెట్టిన సానియా

Sania Mirza: టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా ఫెర్‌వెల్ మ్యాచ్ ముగిసింది. ఇప్పటికే టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన సానియా... హైదరాబాద్‌లోని ఎల్‌.బి స్టేడియం వేదికగా తన చివరి మ్యాచ్ ఆడింది. డబుల్స్‌ మ్యాచ్ సానియా, బోపన్న-ఇవాన్ డోడిక్, మ్యాటెక్ సాండ్స్‌ జోడీ మధ్య జరిగింది. సానియా చివరి మ్యాచ్ ను చూసేందుకు పలువురు టాలీవుడ్, బాలీవుడ్, క్రీడా, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్, మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, అజారుద్దీన్ మ్యాచ్‌ను తిలకించారు. సానియా మ్యాచ్ చూసేందుకు అభిమానులు భారీగా తరలి రావడంతో ఎల్.బి స్టేడియం సందడిగా మారింది. మ్యాచ్ తర్వాత సానియా భావోద్వేగానికి గురై కంటతడి పెట్టింది.

Dhatripriya

Dhatripriya

Next Story