1 Ball 18 Runs: ఒక బాల్.. 18 పరుగులు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..

Salem Spartans Captain Abhishek Tanwar Gave 18 Runs of 1 Ball
x

1 Ball 18 Runs: ఒక బాల్.. 18 పరుగులు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..

Highlights

1 Ball 18 Runs: ఒకే ఓవర్ లో 18 పరుగులు ఇస్తేనే ఓ రేంజ్ లో ఆడుకుంటారు. అలాంటిది ఒకే బంతిలో 18 పరుగులు ఇస్తే ఊరుకుంటారా?

1 Ball 18 Runs: ఒకే ఓవర్ లో 18 పరుగులు ఇస్తేనే ఓ రేంజ్ లో ఆడుకుంటారు. అలాంటిది ఒకే బంతిలో 18 పరుగులు ఇస్తే ఊరుకుంటారా? అస్సలు ఊరుకోరు. ఒకే బంతిలో 18 పరుగులు ఇచ్చి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు ఓ బౌలర్. ఈ ఘటన తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌ (టీఎన్‌పీఎల్) 2023లో చోటుచేసుకుంది. టీఎన్‌పీఎల్ 2023లో భాగంగా మంగళవారం రాత్రి సలేమ్‌ స్పార్టాన్స్‌, చెపాక్‌ సూపర్‌ గల్లీస్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. సాలెం స్పార్టన్స్ టీమ్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఫాస్ట్ బౌలర్ అభిశేక్ తన్వార్, చెపాక్ సూపర్ గిల్లీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ బౌలింగ్‌ వేశాడు.

తొలి 5 బంతుల్లో 7 పరుగులు ఇచ్చిన అభిషేక్ తన్వార్, ఆఖరి బంతి వేసి ఓవర్‌ని ఫినిష్ చేసేందుకు అష్టకష్టాలు పడ్డాడు. ఆఖరి బంతికి బ్యాటర్ సంజయ్ యాదవ్‌ని క్లీన్ బౌల్డ్ చేశాడు అభిషేక్ తన్వార్, అయితే అది నో బాల్‌గా తేలడంతో అతను నాటౌట్‌గా తేలాడు. ఆ తర్వాత కూడా నోబాల్ వేయగా బ్యాటర్ సిక్సర్ కొట్టాడు. మూడో ప్రయత్నంలోనూ నోబాల్ వేయగా.. డబుల్ తీశాడు. తర్వాత వైడ్ వేసిన అభిషేక్ ఎట్టకేలకు సరైన బంతి వేయగా మరో సిక్సర్ వచ్చింది. మొత్తంగా చివరి బంతి కోసం ఏకంగా ఐదు డెలివరీలు వేయగా 18 పరుగులు వచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories