Orleans Masters: ఒర్లీన్స్ మాస్టర్స్ క్వార్టర్స్‌లో సైనా
Orleans Masters: భారత బ్యాడ్మింటన్ స్టార్ , లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ మరో సారి సత్తాచాటింది.
సైనా నెహ్వాల్ ఫైల్ ఫోటో
Orleans Masters: భారత బ్యాడ్మింటన్ స్టార్ , లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ మరో సారి సత్తాచాటింది. ఒర్లీన్స్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్ విజయం సాధించింది. బీడబ్ల్యూఎఫ్ సవరించిన ఒలింపిక్ అర్హత వ్యవధిలో భాగమైన సూపర్ 100 ఈవెంట్‌లో 51 నిమిషాల పాటు కొనసాగిన గేమ్‌లో 65 నంబర్ మేరీని 18-21, 21-15, 21-10 తో ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. తొడ గాయం కారణంగా గత వారం జరిగిన ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్ నుంచి వైదొలిగిన సైనా నెహ్వాల్.. క్వార్టర్స్‌లో ఫ్రాన్స్‌కు చెందిన యాయెల్ హోయాక్స్ లేదా మలేషియాకు చెందిన ఐరిస్ వాంగ్‌ను తలపడాల్సి ఉంది. నాలుగోసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలని పట్టుదలగా ఉన్న సైనా.. ర్యాంకింగ్స్ పాయింట్లు దక్కించుకొని రేసులోకి రావాలని భావిస్తోంది.
Next Story




