Sachin Tendulkar recommends to ICC: ఆ నిబంధనను మార్చండి..ఐసీసీని కోరిన సచిన్‌!

Sachin Tendulkar recommends to ICC: ఆ నిబంధనను మార్చండి..ఐసీసీని కోరిన సచిన్‌!
x
sachin tendulkar
Highlights

Sachin Tendulkar recommends to ICC: క్రికెట్ లోని ఎల్బీడబ్ల్యూల విషయంలో ఆన్‌ఫీల్డ్‌ అంపైర్ల నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేశాడు ఇండియన్ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్..

Sachin Tendulkar recommends to ICC: క్రికెట్ లోని ఎల్బీడబ్ల్యూల విషయంలో ఆన్‌ఫీల్డ్‌ అంపైర్ల నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేశాడు ఇండియన్ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్.. తాజాగా ఈ విషయంపైన విండీస్‌ మాజీ క్రికెటర్‌ బ్రయన్‌ లారాతో మాట్లాడిన సచిన్‌ ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు. ఈ విధానాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మరోసారి పునరాలోచన చేసుకోవాలని అన్నాడు. ఆన్‌ఫీల్డ్‌ అంపైర్‌ నిర్ణయాల్లో బంతి ఎంత శాతం వికెట్లను తాకుతుందనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవద్దని, డీఆర్‌ఎస్‌లో అది వికెట్లను తాకుతున్నట్లు తేలితే.. అంపైర్‌ నిర్ణయంతో సంబంధం లేకుండా ఆ బ్యాట్స్‌మన్‌ను ఔట్‌గా ప్రకటించాలని సచిన్ అభిప్రాయపడ్డాడు.

అయితే తానూ ఐసీసీతో ఏకిభవించనని సచిన్ స్పష్టం చేశాడు. " ఐసీసీతో నేను అంగీకరించని విషయం ఇది.. గత కొంతకాలంగా ఉపయోగిస్తున్న DRS పద్ధతిని అవలంభిస్తున్నారు.. ఎల్బీడబ్ల్యూల విషయంలో 50శాతం మేరకు బంతి వికెట్లను తాకితేనే ఆన్‌ఫీల్డ్‌ అంపైర్‌ దాన్ని ఔట్‌గా ప్రకటిస్తున్నారు. లేదంటే పరిగణించడం లేదు" అని సచిన్ అన్నాడు. ఫీల్డ్‌ అంపైర్‌ నిర్ణయంపైన సందేహం ఉన్నప్పుడు మాత్రమే బౌలర్లు లేదా బాట్స్ మెన్ డీఆర్‌ఎస్‌ పద్ధతికి వెళ్తారని, సాంకేతిక విషయాల ఆధారంగానే నిర్ణయం తీసుకోవాలని సచిన్ అన్నాడు. ఈ విషయంలో టెన్నిస్‌లో పాటించే ఇన్‌ ఆర్‌ ఔట్‌ పద్ధతిని పాటించాలని సచిన్ సూచించాడు.

అయితే సచిన్ చేసిన ఈ వాఖ్యాలకు భారత ఆటగాడు స్పిన్నర్ హర్భజన్ సింగ్ టెండూల్కర్ మద్దతుగా పలికాడు. ఆట మంచి కోసం కొన్ని నిబంధనలు మార్చాల్సిన అవసరం ఉందని భజ్జీ పేర్కొన్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories