Sachin: కోహ్లీ నిర్ణయంపై ఎంతో గర్విస్తున్నా: సచిన్

Venkata Chari
Updated on: 20 Feb 2021 10:00 PM IST
Sachin Commends Virat Kohli for Sharing Personal Experience
X

ఫోటో సచిన్ ట్విట్టర్

తన అనుభవాలను, విజయాల్ని పంచుకున్న టీం ఇండియా సారథి విరాట్ కోహ్లీని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కొనియాడారు. 2014 ఇంగ్లాండ్ పర్యటనలో విఫలమైనందుకు కుంగుబాటుకు గురయ్యానని, ఆ సమయంలో ప్రపంచంలో నేనో ఒంటిరి వాడిలా మిగిలిపోయానని క్లోహ్లీ ఓ కార్యక్రమంలో తన అనుభవాలను షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. అంతేకాక లిటిల్ మాస్టర్ సచిన్ సలహాలు నాకు ఎంతో మేలు చేశాయని చెప్పుకొచ్చాడు.

ఈ సందర్భంగా కోహ్లీని కొనియాడుతూ యువత గురించి సచిన్ ట్వీట్ చేశాడు. " వ్యక్తిగత అనుభవాలు, విజయాలు ఇతరులతో పంచుకోవాలని కోహ్లీ తీసుకున్న నిర్ణయంపై చాలా గర్వంగా ఉందని, సోషల్ మీడియా వేదికగా యువత పరిస్థితులపై అందరూ మాట్లాడుతున్నారే తప్ప.. వాళ్లతో ఎవరూ మాట్లాడట్లేదని వాపోయారు. వాళ్ల పరిస్థితులను తెలుసుకుని, డిప్రెషన్ నుంచి కోలుకునేలా అందరూ సహాయపడాలని" ట్వీట్ లో పేర్కొన్నాడు.

Venkata Chari

Venkata Chari

Next Story