IPL 2024: ధోనీ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. చెన్నై కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న ధోనీ

IPL 2024: ఐపీఎల్‌ సీజన్ 2024 ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది.

Arun Chilukuri
Published on: 21 March 2024 4:43 PM IST
Ruturaj Gaikwad Replaces MS Dhoni As CSK Captain
X

IPL 2024: ధోనీ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. చెన్నై కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న ధోనీ

IPL 2024: ఐపీఎల్‌ సీజన్ 2024 ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ టోర్నీ ప్రారంభం నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ తాజా టోర్నీలో ఆ బాధ్యతల నుంచి వైదొలిగాడు. ఈ మేరకు చెన్నై సూపర్ కింగ్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. కొత్త కెప్టెన్‌గా యంగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్‌కు బాధ్యతను అప్పగించారు. ఈ మేరకు సీఎస్కే ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో తెలిపింది. ట్రోఫీ లాంచింగ్ ఈవెంట్‌లో సైతం కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ కనిపించాడు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story