IPL 2022: హైదరాబాద్‌పై రాజస్థాన్ ఘన విజయం .. 61 పరుగుల తేడాతో...

IPL 2022: 20 ఓవ‌ర్లలో 6 వికెట్ల న‌ష్టానికి 210 ప‌రుగులు చేసిన రాజ‌స్థాన్...

Shireesha
Updated on: 30 March 2022 7:52 AM IST
RR won Over SRH Match Highlights in IPL 2022 Season 15 | Cricket Live News
X

IPL 2022: హైదరాబాద్‌పై రాజస్థాన్ ఘన విజయం .. 61 పరుగుల తేడాతో...

IPL 2022: ఐపీఎల్ 15 సీజన్‌లో భాగంగా పూణెలో హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. 61 పరుగుల తేడాతో హైదరాబాద్‌పై గెలిచింది. 20 ఓవ‌ర్లలో 6 వికెట్ల న‌ష్టానికి 210 ప‌రుగులు చేసిన రాజ‌స్థాన్.. హైద‌రాబాద్‌కు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. 20 ఓవ‌ర్లలో 7 వికెట్లు న‌ష్టపోయి కేవ‌లం 149 ప‌రుగులు మాత్రమే చేసింది హైదరాబాద్ జట్టు. బ్యాటింగ్‌కు దిగ‌గానే మెయిన్ వికెట్లను హైద‌రాబాద్ కోల్పోవ‌డంతో క‌ష్టాల్లో ప‌డిపోయింది.

టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు పూర్తిగా విఫ‌లం అయ్యారు. కెప్టెన్, ఓపెన‌ర్ విలియ‌మ్సన్ కేవ‌లం రెండే ప‌రుగులు చేసి పెవిలియ‌న్ చేరాడు. మ‌రో ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ 19 బంతుల్లో 9 ప‌రుగులే చేశాడు. మార్క్‌ర‌మ్ క‌ష్టప‌డి చేసిన హాఫ్ సెంచ‌రీ వృథా అయిపోయింది.ఆ త‌ర్వాత వాషింగ్టన్ సుంద‌ర్ 40 ప‌రుగులు చేసి స్కోర్ పెంచాడు. రాజ‌స్థాన్ బౌల‌ర్లలో చాహ‌ల్ 3 వికెట్లు, బౌల్ట్, ప్రసిద్ కృష్ణ చెరో రెండు వికెట్లు తీశారు. రాజ‌స్థాన్ బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ సంజు శాంస‌న్ హాఫ్ సెంచ‌రీ చేసి జ‌ట్టుకు భారీ స్కోర్ అందించాడు. ప‌డిక్కల్ 41, బ‌ట్లర్ 35, షిమ్రోన్ 32, ప‌రాగ్ 12 ప‌రుగులు చేశారు.

Shireesha

Shireesha

Next Story