RCB vs DC: ఐపీఎల్ మ్యాచ్ లో సత్తా చాటిన బెంగళూరు

RCB vs DC: ఢిల్లీ జట్టుకు ఖంగుతినిపించిన రాయల్ ఛాలెంజర్స్

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 13 May 2024 7:38 AM IST
Royal Challengers Bengaluru Beat Delhi Capitals By 47 Runs
X

RCB vs DC: ఐపీఎల్ మ్యాచ్ లో సత్తా చాటిన బెంగళూరు

RCB vs DC: ఐపీఎల్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సత్తా చాటింది. ఫ్లే ఆఫ్ రేసులో ప్రత్యేక స్థానాన్ని కైవసం చేసుకుంది. ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్ లో 47 పరుగుల తేడాతో గెలుపొందిన బెంగళూరు, ఢిల్లీ కంటే పైస్థాయికి చేరుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయి 187 పరుగులు చేసింది.

ఆరు పరుగులకే కెప్టన్ డుప్లెసిస్ వెనుదిరగడంతో కోహ్లీ, విల్ జాక్స్, రాజత్ పాటిదర్, కెమరన్ గ్రీన్ బ్యాటును ఝుళిపించడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. చివరి మూడు ఓవర్లలో 5 వికెట్లు కోల్పోవడంతో సాధించాల్సిన పరుగులు తగ్గు ముఖంపట్టాయి. రాజత్ పాటిదర్ అర్థశతకాన్ని నమోదు చేయగా, విల్ జాక్స్, 41 పరుగులు నమోదు చేశాడు. కోహ్లీ 27 పరుగులు అందించారు.

188 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 140 పరుగలకే ఆలౌటైంది. దీంతో బెంగళూరు జట్టు విజయాన్ని కైవసం చేసుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయంలో ఆల్ రౌండర్ ప్రదర్శనతో కెమరాన్ గ్రీన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇప్పటిదాకా ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు చెరో 13 మ్యాచ్ లను ఆడాయి, చెరో 6 మ్యాచ్ లల్లో విజయాన్ని సాధించి 12 పాయింట్లతో ప్లేఆఫ్ బెర్తుకోసం పోటీపడుతున్నాయి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story