IPL 2023: సన్‌రైజర్స్‌పై రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు ఘనవిజయం

IPL 2023: విరాట్ సెంచరీతో అలవోకగా 187 పరుగుల లక్ష్యం ఛేదించిన బెంగళూరు

Jyothi
Published on: 19 May 2023 9:19 AM IST
Royal Challengers Bangalore Rcb Won Against Sunrisers Hyderabad
X

IPL 2023: సన్‌రైజర్స్‌పై రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు ఘనవిజయం

IPL 2023: సన్‌రైజర్స్‌పై రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు దుమ్మురేపింది. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను సొంతగడ్డపై చిత్తుగా ఓడించింది. విరాట్ విజృంభించడంతో 187 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన బెంగళూరు ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్‌.. క్లాసీన్ సెంచరీతో 186 పరుగుల స్కోర్ సాధించింది. ఆ తర్వాత 187 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన బెంగళూరు బ్యాటర్లు ఆరంభం నుంచే సన్‌రైజర్స్‌ బౌలర్లపై విరుచుకుపడ్డారు. డుప్లెసిస్‌, కోహ్లీ తొలి వికెట్‌కు 172 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. కోహ్లీ 63 బంతుల్లో 100 పరుగులు చేయగా.. డుప్లెసిస్‌ 47 బంతుల్లో 71 రన్స్ చేశాడు. 19.2 ఓవర్లలోనే నిర్ణీత లక్ష్యాన్ని ఛేదించింది బెంగళూరు. దీంతో నాలుగో స్థానానికి వెళ్లిన బెంగళూరు మరో మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్స్‌కు చేరుకోనుంది.

Jyothi

Jyothi

Next Story