IPL 2023 RCB Vs MI: ఐపీఎల్‌లో ఆర్‌సీబీ బోణీ.. ముంబయిని ఆటాడుకున్నారు..

IPL 2023 RCB Vs MI: బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

Arun Chilukuri
Published on: 2 April 2023 11:00 PM IST
Royal Challengers Bangalore Beats Mumbai Indians in IPL 2023
X

IPL 2023 RCB Vs MI: ఐపీఎల్‌లో ఆర్‌సీబీ బోణీ.. ముంబయిని ఆటాడుకున్నారు..

IPL 2023 RCB Vs MI: బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ముంబై ఇండియన్స్ పేలవమైన ప్రదర్శనతో పరాజయాన్ని చవిచూసింది. సాధారణంగా ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ తొలిమ్యాచ్‌ను చేజార్చుకునే ఆనవాయితీని పాటించింది. టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ డుప్లెసిస్ ఫీల్డింగ్ ఎంచుకుని, ముంబై ఇండియన్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వనించాడు. నిర్ణీత20 ఓవర్లలో ఏడు వికెట్లను కోల్పోయిన ముంబై జట్టు 171 పరుగులు చేసింది.

ముంబై జట్టులో తెలుగు కుర్రోడు తిలక్ వర్మ చక్కటి ఆటతీరుతో 46 బంతుల్లో 9 బౌండరీలు 4 సిక్సర్లతో 84 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిగతవాళ్లెవ్వరూ పెద్దగా రాణించలేక పోయారు. 172 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ అలవోకగా విజయతీరం చేరింది. ఓపెనర్లు డుప్లెసిస్, విరాట్ కోహ్లీ పదునైన షాట్లతో విరుచుకుపడ్డారు. ఇద్దరూ అర్థశతకాలను నమోదు చేసి జట్టును విజయానికి బాటలు వేశారు. ఇద్దరూ కలిసి తొలివికెట్‌కు 148 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story