రోహిత్‌ ఫిట్... ఆసీస్ పర్యటనకు లైన్‌ క్లియర్‌!

రోహిత్‌ ఫిట్... ఆసీస్ పర్యటనకు లైన్‌ క్లియర్‌!
x
Highlights

భారత డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ ఆసీస్ పర్యటనకి లైన్ క్లియర్ అయింది. తాజాగా జాతీయ క్రికెట్‌ అకాడమీ(ఎన్‌సీఏ)లో శుక్రవారం వైద్య బృందం నిర్వహించిన ఫిట్‌నెస్‌ టెస్టులో రోహిత్ ఫిట్ నేస్ సాధించాడు

భారత డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ ఆసీస్ పర్యటనకి లైన్ క్లియర్ అయింది. తాజాగా జాతీయ క్రికెట్‌ అకాడమీ(ఎన్‌సీఏ)లో శుక్రవారం వైద్య బృందం నిర్వహించిన ఫిట్‌నెస్‌ టెస్టులో రోహిత్ ఫిట్ నేస్ సాధించాడు. ఈ మేరకు బీసీసీఐ ఓ ప్రకటనను విడుదల చేసింది. తోడ కండరాల గాయంతో భారత జట్టుకు దూరం అయ్యాడు రోహిత్.. ఫిట్‌నెస్‌ పరీక్షలో రోహిత్ పాస్ అవ్వడంతో డిసెంబర్‌ 14న ఆస్ట్రేలియాకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

కాగా కరోనా నిబంధనల దృష్ట్యా రోహిత్ శర్మ అక్కడ 14 రోజుల పాటు క్వారంటైన్‌ లో ఉండాల్సిన పరిస్థితి నేలకొంది. అనంతరం జట్టుతో కలవాల్సి ఉంటుంది. అయితే అప్పటికి భారత్, ఆసీస్ జట్ల మధ్య మొదటి రెండు టెస్టులు అయిపోతాయి. చివరి టెస్ట్ ఆడే ఛాన్స్ ఉంది. ఇక ఇదిలా ఉంటే టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సెలవులు పైన ఇండియాకి వస్తుండగా, అజింక్య రహనే టెస్టులకి కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories