Rohit Sharma: చరిత్ర సృష్టించిన రోహిత్.. క్రిస్ గేల్‌ భారీ రికార్డ్‌ బద్దలు.. ప్రపంచ క్రికెట్‌లో అగ్రస్థానం..!

Rohit Sharma Break World Record of Gayle Most Sixes in International in World Cup 2023 Ind vs Afg
x

Rohit Sharma: చరిత్ర సృష్టించిన రోహిత్.. క్రిస్ గేల్‌ భారీ రికార్డ్‌ బద్దలు.. ప్రపంచ క్రికెట్‌లో అగ్రస్థానం..!

Highlights

Rohit Sharma: టీమిండియా కెప్టెన్, బలమైన ఓపెనర్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు.

Rohit Sharma: టీమిండియా కెప్టెన్, బలమైన ఓపెనర్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు. వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్‌ను వెనక్కి నెట్టి రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు సృష్టించాడు. బుధవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో అఫ్గానిస్థాన్‌తో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 5 సిక్సర్లు కొట్టి ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ..

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 5 సిక్సర్లు కొట్టడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో తన మొత్తం 555 సిక్సర్లను పూర్తి చేశాడు. వెస్టిండీస్ గ్రేట్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో మొత్తం 553 సిక్సర్లు కొట్టాడు. క్రిస్ గేల్‌ను వెనక్కి నెట్టి రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు సృష్టించాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్స్..

1. రోహిత్ శర్మ (భారత్) - 555 సిక్సర్లు

2. క్రిస్ గేల్ (వెస్టిండీస్) - 553 సిక్సర్లు

3. షాహిద్ అఫ్రిది (పాకిస్థాన్) – 476 సిక్సర్లు

4. బ్రెండన్ మెకల్లమ్ (న్యూజిలాండ్) - 398 సిక్సర్లు

5. మార్టిన్ గప్టిల్ (న్యూజిలాండ్) - 383 సిక్సర్లు

6. మహేంద్ర సింగ్ ధోని (భారత్) - 359 సిక్సర్లు

భారీ ప్రపంచ రికార్డు బద్దలు..

అంతర్జాతీయ క్రికెట్‌లో 453 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ 473 ఇన్నింగ్స్‌లలో 555 సిక్సర్లు కొట్టిన రికార్డును కలిగి ఉన్నాడు. క్రిస్ గేల్ అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో మొత్తం 553 సిక్సర్లు కొట్టాడు. క్రిస్ గేల్ పేరిట ఉన్న ఈ ప్రపంచ రికార్డును ఇప్పుడు రోహిత్ శర్మ బ్రేక్ చేశాడు. ప్రస్తుతం భారత గ్రేట్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ కూడా ఈ గొప్ప రికార్డుకు దూరంగా ఉన్నాడు. విరాట్ కోహ్లీ తన అంతర్జాతీయ కెరీర్‌లో 283 సిక్సర్లు కొట్టాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాట్స్‌మెన్స్..

555 సిక్సర్లు - రోహిత్ శర్మ

359 సిక్సర్లు - మహేంద్ర సింగ్ ధోని

283 సిక్సర్లు - విరాట్ కోహ్లీ

264 సిక్సర్లు - సచిన్ టెండూల్కర్

251 సిక్సర్లు - యువరాజ్ సింగ్

247 సిక్సర్లు - సౌరవ్ గంగూలీ

243 సిక్సర్లు - వీరేంద్ర సెహ్వాగ్

Show Full Article
Print Article
Next Story
More Stories