Rohit Sharma: రోహిత్ శర్మ @ 200.. టీ20ల్లో రోహిత్ స్పెషల్ రికార్డ్..

Rohit Sharma: టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రెండో ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 25 Jun 2024 3:59 PM IST
Rohit Sharma becomes first to hit 200 sixes in T20Is
X

Rohit Sharma: రోహిత్ శర్మ @ 200.. టీ20ల్లో రోహిత్ స్పెషల్ రికార్డ్..

Rohit Sharma: సోమవారం సెయింట్ లూసియాలోని డారెన్ సామీ క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 ప్రపంచ కప్ 2024 మ్యాచ్ సందర్భంగా T20Iల్లో 200 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు.

టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రెండో ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్ 8 పోరులో భారత బ్యాటర్ ఈ ఘనత సాధించాడు.

రోహిత్ ఇంతకుముందు 40 సిక్సర్లు కొట్టిన డేవిడ్ వార్నర్, జోస్ బట్లర్‌ను అధిగమించాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్ తర్వాత రోహిత్ శర్మ నిలిచాడు.

భారత ఓపెనర్ T20 ప్రపంచ కప్‌లలో 42 ఇన్నింగ్స్‌లు ఆడాడు. 10 అర్ధసెంచరీలు, ఒక సెంచరీ సహాయంతో 1000 పైగా పరుగులు చేశాడు.

టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్లు:

1) క్రిస్ గేల్ - 63

2) రోహిత్ శర్మ - 44

3) జోస్ బట్లర్ - 43

4) డేవిడ్ వార్నర్ - 40

5) యువరాజ్ సింగ్ - 33

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story