అరుదైన రికార్డు సొంతం చేసుకున్న రోహిత్ శర్మ

అరుదైన రికార్డు సొంతం చేసుకున్న రోహిత్ శర్మ
x
Highlights

రోహిత్‌ శర్మ అంటేనే సిక్సర్లకు పెట్టింది పేరు ఒక్కసారి మైదానంలో పాతుకుపోయాడంటే సిక్సర్ల వర్షం కురిపిస్తాడు. ఆసీస్‌ టూర్‌కి కాస్త ఆలస్యంగా ఎంట్రీ...

రోహిత్‌ శర్మ అంటేనే సిక్సర్లకు పెట్టింది పేరు ఒక్కసారి మైదానంలో పాతుకుపోయాడంటే సిక్సర్ల వర్షం కురిపిస్తాడు. ఆసీస్‌ టూర్‌కి కాస్త ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన హిట్‌మ్యాన్‌ వచ్చీ రావడంతోనే అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియాపై అన్ని ఫార్మాట్లు కలిపి వంద సిక్సర్లు కొట్టిన ఏకైక​టీమిండియా ఆటగాడిగా రికార్డు సొంతం చేసుకున్నాడు. సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఇన్నింగ్స్‌ 16వ ఓవర్లో నాథన్‌ లయన్‌ బౌలింగ్‌లో లాంగాన్‌ మీదుగా కొట్టిన సిక్స్‌ ద్వారా ఈ ఘనత సాధించాడు. రోహిత్‌ ఆసీస్‌పై కొట్టిన వంద సిక్సర్లలో 63 సిక్స్‌లు వన్డేల్లోనే రావడం విశేషం.

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదినవారిలో రోహిత్ కంటే ముందు ఇద్దరు మాత్రమే ఉన్నారు. అందులో ఒకరు విండీస్ విధ్వంస‌క బ్యాట్స్‌మ‌న్ క్రిస్ గేల్ కాగా.. మ‌రొక‌రు పాకిస్థాన్ బ్యాట్స్‌మ‌న్ షాహిద్ అఫ్రిది. ఒక ప్రత్యర్థిపై వంద సిక్స్‌లు కొట్టిన రెండో ప్లేయ‌ర్ రోహిత్‌. ఇంత‌కుముందు ఇంగ్లండ్‌పై అన్ని ఫార్మాట్లలో క‌లిపి గేల్ 140 సిక్సర్లు కొట్టాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories