ఇదేం ఫీల్డింగ్.. షర్ట్‌ లేకుండా బాల్ వెంటపడ్డ క్రికెటర్

Samba Siva Rao
Updated on: 2 Feb 2021 8:10 PM IST
ఇదేం ఫీల్డింగ్.. షర్ట్‌ లేకుండా బాల్ వెంటపడ్డ క్రికెటర్
X

క్రికెట్ లో ఒక్క పరుగు చాలు ఎంత అమూల్యమైందో చెప్పడానికి.. ఒక్క పరుగుల తేడాతో ఓడిన టీమ్ లు ఉన్నాయి. చివరి బంతికి ఒక్క పరుగు చేసి గెలిచిన ఉఠ్కంట భరిత క్షణాలు ఉన్నాయి. అయితే ఓ క్రికెటర్ విలువైన నాలుగు పరుగులను వదిలేశాడు. ఆ ప్లేయర్ బౌండరీ వైపు పోతున్నాబంతిని.. గమనించినా ఆపే ప్రయత్నం చేయలేదు కదా.. బంతి వెనక పరిగెత్తుతు షర్ట్ ధరించే ప్రయత్నం చేశాడు. దీంతో అభిమానులకు ఒళ్లు మండిపోయింది. దీంతో ఆ ప్లేయర్ పై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు.

అబుదాబి టీ10 లీగ్ చాలా సీరియస్‌గా జరుగుతున్న వేళ అబుదాబి ఫీల్డర్ రోహన్ ముస్తఫా తన చెత్త ప్రవర్తనతో గేమ్ సీరియస్‌నెస్‌ను పోగొట్టాడు. క్రికెట్‌నే అపహాస్యం చేసేలా వ్యవహరించాడు. అబుదాబి టీం, నార్త్రన్ వారియర్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. సెకండ్ ఇన్నింగ్స్ జరుగుతున్న సమయంలో.. రోహన్ ముస్తఫా ఫీల్డింగ్ సమయంలో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించాడు.

ఇక ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్ కొట్టిన షాట్ ముస్తఫా వైపు ఉన్న బౌండరీ లైన్ వైపు వచ్చింది. ఆ సమయంలో విప్పేసిన షర్ట్ వేసుకుంటూ ముస్తఫా బంతి వెంట పరుగులు తీశాడు. ఆ బంతి బౌండరీ లైన్‌ను తాకి ఫోర్ వెళ్లింది. ముస్తఫా షర్ట్‌లెస్ ఫీల్డింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో వారియర్స్ జట్టు ౮ వికెట్ల తేడాతో విజయం సాధించింది.



Samba Siva Rao

Samba Siva Rao

Next Story