Federer-Nadal: ఓటమితో కెరీర్‌కు వీడ్కోలు.. ఫెదరర్‌, నాదల్‌ కన్నీటి పర్యంతం

Federer-Nadal: టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ ఓటమితో కెరీర్‌కు ముగింపు పలికాడు.

Arun Chilukuri
Published on: 24 Sept 2022 1:59 PM IST
Roger Federer, Rafael Nadal Break Down in Tears
X

Federer-Nadal: ఓటమితో కెరీర్‌కు వీడ్కోలు.. ఫెదరర్‌, నాదల్‌ కన్నీటి పర్యంతం

Federer-Nadal: టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ ఓటమితో కెరీర్‌కు ముగింపు పలికాడు. టెన్నిస్ స్టార్ ప్లేయర్ ఫెదరర్ లావెర్ కప్ లో నాదల్ తో కలిసి లాస్ట్ మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాట్ తో టెన్నిస్ కు వీడ్కోలు పలికాడు ఫదరర్. వీడ్కోలు సమయంలో ఫెదరర్ తో పాటు తోటి ఆటగాళ్లు వెక్కివెక్కి ఏడ్చారు. మ్యాచ్ అనంతరం నాదల్, సోక్, టియాఫోన్ ఫెదరర్ ను ఆలింగనం చేసుకుంటున్నప్పుడు కోర్టులో ఒక్కసారిగా భావోద్వేగ వాతావరణం నెలకొంది.

ఫెదరర్ ఆటకు వీడ్కోలు పలకడాన్ని తట్టుకోలేక అభిమానులు, టెన్నిస్ స్టార్స్ కన్నీరు పెట్టుకున్నారు. స్టాండ్స్ లో నిలబడి ఫెదరర్ కు క్లాప్స్ తో వీడ్కోలు పలికారు. ఈ మ్యాచ్ కు హాజరైన ఫెదరర్ భార్య మిర్కా, పిల్లలు అతన్ని హత్తుకుని కన్నీరు పెట్టుకున్నారు.

లావెర్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆడిన అనంతరం ప్రొఫెషనల్ టెన్నిస్ కు ఫెదరర్ గుడ్ బై చెప్పేశారు. ఈ సందర్భంగా తన కెరియర్ ఓ పర్ఫెక్ట్ జర్నీ అని చెప్పాడు. తనను అభిమానించిన ఫ్యాన్స్ కు ఫెదరర్ కృతజ్ఞతలు తెలిపాడు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story