Roger Federer: టెన్నిస్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన రోజర్‌ ఫెదరర్

Roger Federer: లండన్‌లో జరగనున్న లావర్ కప్ టోర్నమెంట్‌ చివరిదన్న రోజర్

Rama Rao
Updated on: 15 Sept 2022 9:00 PM IST
Roger Federer Announces Retirement | Sports News
X

Roger Federer: టెన్నిస్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన రోజర్‌ ఫెదరర్ 

Roger Federer: స్విస్ టెన్నిస్ దిగ్గజ ఆటగాడు, మాజీ వరల్డ్ ఛాంపియన్ రోజర్ ఫెదరర్‌ టెన్నిస్ వరల్డ్‌కు షాక్ ఇచ్చాడు. టెన్నిస్‌కు ఆయన రిటైర్మెంట్ ప్రకటించాడు. వచ్చే వారం లండన్‌లో జరగనున్న లావర్ కప్ టోర్నమెంటే చివరిదంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ ద్వారా ఫ్యాన్స్‌కు తెలియజేశాడు. టెన్నీస్ తనకు చాలా ఇచ్చిందని చెప్పుకొచ్చాడు. మూడేళ్లుగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నానని 24 ఏళ్ల పాటు సాగిన కెరీర్‌కు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన సమయం వచ్చిందంటూ తెలిపాడు. 20 సార్లు గ్రాండ్ స్లామ్ చాంపియన్‌ గా రికార్డ్ సృష్టించిన ఫెదరర్ గత మూడేళ్లుగా మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు.

Rama Rao

Rama Rao

Next Story