Road Safety World Series: దిగ్గజ జట్ల మధ్య ఆసక్తికర పోరు..సచిన్ డౌటే!

Road Safety World Series:
x

రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌  సిరీస్

Highlights

Road Safety World Series: రాయ్‌పుర్‌లో వేదికగా మంగళవారం మరో ఆసక్తికర పోరు జరగనుంది.

Road Safety World Series: రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ టీ20 సిరీస్‌ (2020-2021)లో భాగంగా రాయ్‌పుర్‌లో వేదికగా మంగళవారం మరో ఆసక్తికర పోరు జరగనుంది. నేడు ఇండియా లెజెండ్స్ తో ఇంగ్లాండ్ లెజెండ్స్ తలపడనుంది. భారత్ జట్టుకు దిగ్గజ ఆటగాడు సచిన్ నాయకత్వం వహించనున్నాడు. మరో వైపు ఇంగ్లాండ్ లెజెండ్స్ జట్టుకు కెప్టెన్ గా కెవిన్ పీటర్సన్ సారథ్య బాధ్యతలు వహించనున్నాడు. దిగ్గజ జట్ల మధ్యపోరు ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ప్రారంభంకానుంది. ఇప్పటికే బంగ్లా లెజెండ్స్ జట్టుపై రెండు జట్లు తలపడ్డాయి. రెండు జట్లు బంగ్లాదేశ్ పై విజయం సాధించి ఉత్సాహంతో ఉన్నాయి.

మరోవైపు ఇరుజట్ల మధ్య మ్యాచ్ కోసం భారత అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై చాలా కాలమైనా సచిన్, సెహ్వాగ్ బ్యాటింగ్ రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ టీ20 సిరీస్‌ ద్వారా చూడాలని ఫ్యాన్స్ తహాతహాలాడిపోతున్నారు. చాలా కాలం తర్వాత అప్పటి భారత్ జట్లులోని స‌భ్యులు అందరూ లెజెండ్స్ జట్టులో ఉండడంతో మ్యాచ్ తో అభిమానులు మళ్లి పాతరోజులు గుర్తుచేసుకుంటున్నారు. టీమిండియా జట్టులో యువరాజ్, బద్రీనాథ్, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, కైఫ్, మునాఫ్ పటేల్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఉన్నారు. ఫిట్‌నెస్‌ ప్రక్రియలో భాగంగా సచిన్‌ తాజాగా తన ఎడమ మోచేతికి సూదులు గుచ్చుకొని ఫిజియో పర్యవేక్షణలో సిద్ధమవుతున్నాడు. సచిన్ ఫిట్‌నెస్ లో‌ విజయం సాధించి, మ్యాచ్ లో ఆడాలని అభిమానలు కోరుకుంటున్నారు.

గత ఏడాది ప్రారంభమైన ఈ సిరీస్ కరోనా వైరస్ కారణంగా అర్థాంతరంగా నిలిచిపోయింది. ఈ ఏడాది పరిస్థితులు కుదుటపడటంతో మళ్ళి సిరీస్ ఆరంభమైంది. కరోనా భయంలో ఆస్ట్రేలియా లెజెండ్స్ జట్టు సిరీస్ నుంచి వైదోలిగింది. ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ లెజెండ్స్ సిరీస్ లో ఆడేందుకు ఆసక్తి చూపించాయి. దీంతో ఆరో తేదీ నుంచి సిరీస్ ప్రారంభమైన సంగతి తెలిసిందే.

రోడ్‌ సేఫ్టీ సిరీస్‌లో భాగంగా ఇండియా లెజెండ్స్‌ సత్తా చాటుతుంది. ఓపనర్లు సచిన్, సెహ్వాగ్ పరుగుల వరద పారిస్తున్నారు. గత మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 35 బంతుల్లో (80 నాటౌట్; 35 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు‌) సచిన్‌ టెండూల్కర్‌ (33 నాటౌట్‌; 5 ఫోర్లు) మెరుపులు మెరిపించడంతో బంగ్లాదేశ్‌ చిత్తుచిత్తుగా ఓడింది. మొదట బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ ధాటికి 19.4 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌటైంది. వినయ్‌కుమార్‌ (2/25), ప్రజ్ఞాన్ ఓజా (2/12), యువరాజ్‌ సింగ్ (2/15) కీలక వికెట్లు పడగొట్టారు. లక్ష్య ఛేదన ఆరంభించిన ఇండియా లెజెండ్స్ జట్టు 10.1 ఓవర్లోనే ముగించింది. ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన వినయ్‌కుమార్ ఈ మ్యాచ్ లో ఇరగదీశాడు.

బంగ్లా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మరో మ్యాచ్ లో ఇంగ్లీష్ జట్టు ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా లెజెండ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 113 పరుగులే చేసింది. ముషిఫీకర్ రెహ్మాన్ 31పరుగుతో టాప్ స్కోరర్ గా నిలిచారు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లాండ్ లెజెండ్స్ 14 ఓవర్లలోనే విజయ లక్ష్యాన్ని చేధించింది. కెప్టెన్ కెవిన్ పీటర్సన్ 42 పరుగలు, మ్యాడ్డీ 32 పరుగులు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories