WPL 2024: నెరవేరిన కల.. తొలిసారి డబ్ల్యూపీఎల్‌ టైటిల్‌ ఆర్సీబీ సొంతం

WPL 2024: 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించిన ఆర్సీబీ

Jyothi
Updated on: 18 March 2024 7:21 AM IST
RCB Women Win WPL 2024 Title
X

WPL 2024: నెరవేరిన కల.. తొలిసారి డబ్ల్యూపీఎల్‌ టైటిల్‌ ఆర్సీబీ సొంతం

WPL 2024: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టైటిల్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కైవసం చేసుకుంది. WPL ఫైనల్లో ఆర్సీబీ జట్టు 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై ఘన విజయం సాధించింది. 114 పరుగుల విజయలక్ష్యాన్ని బెంగళూరు జట్టు 19.3 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆర్సీబీ ఛేజింగ్‌లో టాపార్డర్ రాణించింది. ఓపెనర్లు కెప్టెన్ స్మృతి మందన్న 31, సోఫీ డివైన్ 32, ఎలిస్ పెర్రీ 35, రిచా ఘోష్ 17 పరుగులు చేశారు.

ఢిల్లీ బౌలర్లలో శిఖా పాండే 1, మిను మణి 1 వికెట్ తీశారు. ముందుగా టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ అమ్మాయిల జట్టు బ్యాటింగ్ ఎంచుకోగా... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 18.3 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. శ్రేయాంక పాటిల్ సూపర్ స్పెల్ తో ఢిల్లీ క్యాపిటల్స్ విలవిల్లాడింది. శ్రేయాంక 3.3 ఓవర్లలో కేవలం 12 పరుగులిచ్చి 4 వికెట్లు తీసింది. సోఫీ మోలినాక్స్ 3, ఆశా శోభన 2 వికెట్లతో సత్తా చాటారు.

Jyothi

Jyothi

Next Story