RCB: ఆర్సీబీని అమ్మేయనున్నారా? తొలి టైటిల్ గెలిచిన తర్వాత కీలక పరిణామం!

RCB Stake Sale News 2025
x

RCB: ఆర్సీబీని అమ్మేయనున్నారా? తొలి టైటిల్ గెలిచిన తర్వాత కీలక పరిణామం!

Highlights

RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భారీ ఫ్యాన్‌బేస్‌ను కలిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీ యాజమాన్యంలో పెద్ద మార్పుకు వేదిక ఏర్పడే అవకాశం కనిపిస్తోంది.

RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భారీ ఫ్యాన్‌బేస్‌ను కలిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీ యాజమాన్యంలో పెద్ద మార్పుకు వేదిక ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల తమ తొలి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్న ఆర్సీబీ ఫ్రాంచైజీలో యాజమాన్య మార్పు సంభవించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బ్రిటన్‌కు చెందిన మద్యం తయారీ దిగ్గజ సంస్థ డయాజియో పీఎల్‌సీ ఆర్సీబీలో ఉన్న తమ వాటాను విక్రయించేందుకు ప్రాథమిక చర్చలు ప్రారంభించినట్టు విశ్వసనీయ సమాచారం.

ప్రస్తుతం డయాజియో, భారతీయ అనుబంధ సంస్థ యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ ద్వారా ఆర్సీబీని నిర్వహిస్తోంది. ఆర్సీబీ వాటా విక్రయానికి సంబంధించి పాక్షికంగా గానీ, పూర్తిగా గానీ అవకాశాలు పరిశీలిస్తూ... సలహాదారులతో చర్చలు జరుపుతోంది. ఇటీవల టైటిల్ గెలవడం వలన ఆర్సీబీ బ్రాండ్ విలువ భారీగా పెరగడంతో, దాన్ని నగదుగా మలచుకోవాలన్న డయాజియో ప్రణాళికలో భాగంగా ఇది జరగుతోంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ వాణిజ్య పరంగా విస్తరించిన తీరును పరిశీలిస్తే, ప్రస్తుతానికి ఆర్సీబీ ఫ్రాంచైజీ విలువ దాదాపు 2 బిలియన్ డాలర్ల వరకు ఉండవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఐపీఎల్ ప్రపంచ స్థాయిలో ఎన్ఎఫ్ఎల్, ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ వంటి దిగ్గజ లీగ్‌ల సరసన నిలుస్తుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

డయాజియో ఈ నిర్ణయం తీసుకోవడానికి ఉన్న ప్రధాన కారణాల్లో భారత ప్రభుత్వం మద్యం బ్రాండ్‌లకు సంబంధించిన ప్రకటనలపై విధిస్తున్న ఆంక్షలు ఒకటి. ముఖ్యంగా క్రికెట్ వంటి ప్రధాన క్రీడా ఈవెంట్‌ల సమయంలో మద్యం ప్రచారంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒత్తిడి పెంచుతుండటం, మరోవైపు అమెరికాలో ప్రీమియం మద్యం అమ్మకాలు తగ్గడంతో కంపెనీ వ్యయ నియంత్రణ చర్యలకు దారితీసింది.

గతంలో విజయ్ మాల్యా అధీనంలో ఉన్న ఆర్సీబీ, ఆయన వ్యాపారాన్ని డయాజియో కొనుగోలు చేసిన తర్వాత వారి చేతుల్లోకి వెళ్లింది. ఆర్సీబీ జట్టులో క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ ఉండటంతో, బ్రాండ్‌కు అంతర్జాతీయంగా విశేష గుర్తింపు లభించింది. కోహ్లీ గ్లోబల్ ఫాలోయింగ్ కూడా ఆర్సీబీ మార్కెట్ వాల్యూను పెంచే కారకంగా మారింది.

ఇంకా అధికారికంగా డయాజియో గానీ, యునైటెడ్ స్పిరిట్స్ గానీ ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ, ఇటీవలి విజయాన్ని ఉపయోగించుకుని తమ వాటాను విక్రయించేందుకు డయాజియో ప్రణాళికలు వేస్తోందన్న మాట ఐపీఎల్ వర్గాల్లో గట్టిగానే వినిపిస్తోంది. ఈ పరిణామం టోర్నమెంట్ వర్గాల్లో చర్చకు దారి తీసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories