Ravindra Jadeja: ఆఫ్ఘన్ ఓడిపోతే బ్యాగ్ సర్దుకొని ఇంటికి వెళ్తాం

* విలేకరి అడిగిన ప్రశ్నకి జడేజా చేసిన కామెంట్స్ మాత్రం సోషల్ మీడియా వైరల్ గా మారాయి.

Sandeep Reddy
Updated on: 6 Nov 2021 1:30 PM IST
Ravindra Jadeja Epic Reply to Reporter in Press Meet Yesterday 05 11 2021
X

Ravindra Jadeja: ఆఫ్ఘన్ ఓడిపోతే బ్యాగ్ సర్దుకొని ఇంటికి వెళ్తాం

Ravindra Jadeja: టీ20 ప్రపంచకప్ 2021లో భారత్ -స్కాట్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఘనవిజయం సాధించిన టీమిండియా నెట్ రన్ రేట్ లో మిగిలిన జట్ల కంటే ముందున్న సెమీస్ చేరడానికి మాత్రం ఆఫ్ఘనిస్తాన్ - న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్ కీలకంగా మారనుంది. నవంబర్ 8న నమీబియాతో జరిగే మ్యాచ్ లో టీమిండియా ఘనవిజయం సాధించడంతో పాటు ఆఫ్ఘన్ చేతిలో కివీస్ ఓడితే భారత్ సెమీస్ చేరినట్టే.

అయితే ఇప్పటికే మంచి ఫామ్ లో కివీస్ ఆటగాళ్ళను ఆఫ్ఘన్ జట్టు ఎంతవరకు ఎదుర్కోగలదో నవంబర్ 7న తేలనుంది. అయితే శుక్రవారం స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా గెలుపొందిన తరువాత విలేకరి అడిగిన ప్రశ్నకి జడేజా చేసిన కామెంట్స్ మాత్రం సోషల్ మీడియా వైరల్ గా మారాయి.

స్కాట్లాండ్‌తో మ్యాచ్‌ ముగిసిన అనంతరం ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన రవీంద్ర జడేజా ఒక విలేకరి.. న్యూజిలాండ్ చేతిలో ఆఫ్ఘనిస్థాన్‌ ఓడిపోతే ఏం చేస్తారు? అని ప్రశ్నించాడు. "అదే జరిగితే.. చేసేదేముంది. మేము బ్యాగ్ సర్దుకుని ఇంటికి వెళ్తాం" అని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. జడేజా ఇచ్చిన సమాధానానికి విలేకరి కూడా నవ్వుకున్నాడు.

ఈ మ్యాచ్ లో మూడు వికెట్లు పడగొట్టిన రవీంద్ర జడేజా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. అయితే ఇప్పటికే పాకిస్తాన్ తో ఓడిన కివీస్‌ జట్టుపై ఆఫ్ఘన్ జట్టు ఎంత వరకు తమ ప్రదర్శన చూపిస్తుందో వేచి చూడాల్సిందే. ఇప్పటికే గ్రూప్ 2 నుండి పాకిస్తాన్ జట్టు, గ్రూప్ 1 నుండి ఇంగ్లాండ్ జట్టు సెమీస్ కి చేరాయి.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story