IPL 2023: ఐపీఎల్ ఫైనల్ విజేత ఎవరో చెప్పేసిన రవిశాస్త్రి..!

IPL 2023: ఐపీఎల్ 2023 లీగ్ స్టేజ్ పోరు ప్రస్తుతం రసవత్తరంగా సాగుతోంది.

Arun Chilukuri
Updated on: 5 May 2023 7:30 PM IST
Ravi Shastri Said Who Will be the Winner of IPL 2023 Final
X

IPL 2023: ఐపీఎల్ ఫైనల్ విజేత ఎవరో చెప్పేసిన రవిశాస్త్రి..!

IPL 2023: ఐపీఎల్ 2023 లీగ్ స్టేజ్ పోరు ప్రస్తుతం రసవత్తరంగా సాగుతోంది. ఈ సీజన్ లో ఇప్పటికే 47 మ్యాచులు పూర్తికాగా ప్లే ఆఫ్స్ చేరుకునేందుకు 7 జట్ల మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. ఫ్లే ఆఫ్స్ కు ఏయే జట్లు అర్హత సాధిస్తాయో ప్రస్తుతానికి హై సస్పెన్స్ గా ఉంటే టీమిండియా మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ మాత్రం ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించే జట్లు ఇవేనంటూ జోస్యం చెప్పారు. హర్భజన్ సింగ్ చెప్పినదాని ప్రకారం చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ కు చేరుకుంటాయని చెప్పాడు.

అయితే ఈ సీజన్ లో ఏ జట్టు ఛాంపియన్ గా నిలుస్తుందని ఇప్పుడే చెప్పలేమని హర్భజన్ ప్రకటిస్తే..మాజీ దిగ్గజ క్రికెటర్ రవిశాస్త్రీ మాత్రం ఐపీఎల్ 16 విజేత ఎవరో ప్రకటించేశాడు. రవిశాస్త్రీ అంచనాల ప్రకారం గుజరాత్ టైటన్స్ టైటిల్ విజేతగా నిలుస్తుందని చెబుతున్నారు. ఆ జట్టు ఆటతీరు, కూర్పు అందుకు నిదర్శనం అంటున్నారు. ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చిన ఏడాదిలోనే గుజరాత్ టైటిల్ ను ఎగరేసుకుపోయింది.

ప్రస్తుత పోటీలో కూడా ఇదే టీమ్ 6 విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్ పొజిషన్ లో ఉంది. విజయం కోసం గుజరాత్ టీమ్ సమిష్టిగా రాణించడం..ఆ టీమ్ కు ఎంతో కలిసివస్తోందని రవిశాస్త్రి చెబుతున్నారు. ఇక ఈ ఐపీఎల్ లో రాజస్థాన్ జట్టును సంజూ శాంసన్ నడిపిస్తున్న తీరును కూడా అభినందించారు. స్పినర్లను సంజు చాలా బాగా వినియోగించుకుంటున్నాడని ప్రశంసించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story